బాహుబలి సన్నివేశాల లీకేజీ కేసులో వర్మ అరెస్ట్ | Baahubali leaked case: varma arrested | Sakshi
Sakshi News home page

బాహుబలి సన్నివేశాల లీకేజీ కేసులో వర్మ అరెస్ట్

Published Sat, Jan 31 2015 1:22 PM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

బాహుబలి సన్నివేశాల లీకేజీ కేసులో వర్మ అరెస్ట్ - Sakshi

బాహుబలి సన్నివేశాల లీకేజీ కేసులో వర్మ అరెస్ట్

హైదరాబాద్ : బాహుబలి సినిమా లీకేజీ కేసులో వర్మ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.  మకుట విజువల్ ఎఫెక్ట్లో పని చేస్తున్న వర్మ ...పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వీడియో ఫుటేజీని కాపీ కొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ దృశ్యాలను వర్మ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడని పోలీసులు నిర్థారణకు వచ్చారు.

బహుబలి చిత్రానికి సంబంధించి కొన్ని దృశ్యాలను సోషల్ మీడియాలో లీక్ చేశారంటూ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ  సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  సినిమా విరామానికి ముందు 12 నుంచి 15 నిమిషాల దృశ్యాలు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్లో బహిర్గతమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.  కాగా  80 కోట్ల బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలోంచి 13 నిమిషాల నిడివిగల సన్నివేశాలు లీకవ్వడం పట్ల టాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement