
బాహుబలి సినిమా సన్నివేశాలు లీక్!
బాహుబలి సినిమా కొంత వరకు లీకైంది! ఈ విషయమై సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. 13 నిమిషాల నిడివిగల సినిమా లీకైంది. గుర్తు తెలియని వ్యక్తి ఈ ఫుటేజిని నెట్లోకి అప్ లోడ్ చేశాడు. మూడు రోజులుగా ఇది నెట్లో హల్చల్ చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ సిబ్బంది మీదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికి పదిమంది సిబ్బందిని పోలీసులు విచారించారు.
ఎడిట్ చేసిన వెర్షన్ మాత్రమే లీకైంది. అంటే, అది ఎడిట్ సూట్ నుంచే బయటకు రావాలి. 180 కోట్ల బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలోంచి 13 నిమిషాల నిడివిగల సన్నివేశాలు లీకవ్వడం పట్ల టాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. వాట్సప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలలో ప్రస్తుతం ఈ సన్నివేశాలు జోరుగా తిరుగుతున్నాయి. ఎడిట్ సూట్లో ఉన్నవారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.