
హైప్ ఎక్కువ... కలెక్షన్లు తక్కువ
భారీ అంచనాలతో విడుదలైన కత్రినా కైఫ్, సిద్ధార్థ మల్హోత్రా బాలీవుడ్ సినిమా 'బార్ బార్ దేఖో' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. తొలి మూడు రోజుల్లో భారత్లో 21.16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆశ్చర్యకరంగా ఆదివారం వసూళ్లు మరింత తగ్గాయి. శుక్రవారం రూ. 6.81 కోట్లు, శనివారం రూ. 7.65 కోట్లు, ఆదివారం రూ. 6.70 కోట్లు రాబట్టిందని హిందీ సినీ విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
నిత్యా మెహ్రా దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 'బార్ బార్ దేఖో'లో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య సన్నివేశాలు సినిమా విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ కలెక్షన్లు ఖాయమని భావించారు. సినిమా విడుదలైన తర్వాత అంచనాలు తల్లకిందులయ్యాయి.
#BaarBaarDekho Fri 6.81 cr, Sat 7.65 cr, Sun 6.70 cr. Total: ₹ 21.16 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) 12 September 2016