Baar Baar Dekho
-
హైప్ ఎక్కువ... కలెక్షన్లు తక్కువ
భారీ అంచనాలతో విడుదలైన కత్రినా కైఫ్, సిద్ధార్థ మల్హోత్రా బాలీవుడ్ సినిమా 'బార్ బార్ దేఖో' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. తొలి మూడు రోజుల్లో భారత్‌లో 21.16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆశ్చర్యకరంగా ఆదివారం వసూళ్లు మరింత తగ్గాయి. శుక్రవారం రూ. 6.81 కోట్లు, శనివారం రూ. 7.65 కోట్లు, ఆదివారం రూ. 6.70 కోట్లు రాబట్టిందని హిందీ సినీ విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. నిత్యా మెహ్రా దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 'బార్ బార్ దేఖో'లో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య సన్నివేశాలు సినిమా విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ కలెక్షన్లు ఖాయమని భావించారు. సినిమా విడుదలైన తర్వాత అంచనాలు తల్లకిందులయ్యాయి. #BaarBaarDekho Fri 6.81 cr, Sat 7.65 cr, Sun 6.70 cr. Total: ₹ 21.16 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 12 September 2016 -
మేకింగ్ ఆఫ్ మూవీ- బార్ బార్ దేఖో
-
రెండో రోజు పెరిగిన కలెక్షన్లు
కత్రినా కైఫ్, సిద్ధార్థ మల్హోత్రా నటించిన బాలీవుడ్ సినిమా 'బార్ బార్ దేఖో' తొలి రెండు రోజుల్లో భారత్‌లో 14.46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. తొలిరోజు 6.81 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో రోజు 7.65 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆదివారం కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లు రావచ్చని భావిస్తున్నారు. నిత్యా మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ రోమాంటిక్ డ్రామా ఫిల్మ్ 'బార్ బార్ దేఖో'లో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. భోజనం తక్కువగా తీసుకోవడంతో పాటు జిమ్‌లో బాగా కష్టపడ్డానని కత్రినా చెప్పింది. -
కత్రినా ఏం చేసిందో చూడండీ!
బాలీవుడ్ రోమాంటిక్ డ్రామా ఫిల్మ్ 'బార్ బార్ దేఖో' ప్రమోషన్లలో మూవీ యూనిట్ బిజీబిజీగా ఉంది. నిత్యా మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం కొన్ని రోజులు చాలా కష్టపడ్డాం అని చెప్పిన హీరో సిద్ధార్థ్.. కత్రినాతో కలసి మూవీ ప్రమోషన్ కోసం ఇండోర్ వెళ్లాడు. బిజీబిజీ షూటింగ్ షెడ్యూల్స్, ఆ వెంటనే ప్రమోషన్ల కోసం జర్నీ చేయడంతో ముద్దుగుమ్మ కత్రినా కాస్త అలసటగా ఫీలైంది. దీంతో వాళ్లు ట్రావెల్ చేస్తున్న వాహనంలో కూర్చుని కత్రినా అలాగే కాస్త కునుకు తీసింది. వెంటనే సిద్ధార్థ్ ఆ దృశ్యాన్ని ఫొటో తీశాడు. కత్రినాలాగ ఎవరైనా నిద్రపోగలరా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. దాంతో పాటు కొన్ని డ్యాన్స్ సీన్లను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ మూవీకి విపరీతమైన ప్రచారం లభించింది. కత్రినా అలా నిద్రించడానికి కారణాలు పోస్ట్ లో పేర్కొన్నాడు. కోల్ కతా, జైపూర్లలో మెట్రో రైళ్లలో, ట్రామ్ వాహనాలలో డ్యాన్స్ చేయడంతో అలసటకు గురైన కత్రినా కాస్త విశ్రాంతి కోరుకుందని వివరించాడు. సిద్ధార్థ మల్హోత్రా, కత్రినా కైఫ్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలకానుంది. -
ఆ సీన్లో కత్రినా కైఫ్ నటించలేదు
కోల్‌కతా: సెన్సార్ బోర్డుతో తమకు ఎలాంటి వివాదాలులేవని బాలీవుడ్ రోమాంటిక్ డ్రామా ఫిల్మ్ 'బార్ బార్ దేఖో' దర్శకుడు నిత్యా మెహ్రా చెప్పింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ నటించిన ఓ సీన్‌కు సంబంధించి సెన్సార్ బోర్డుతో విబేధాలు ఏర్పడినట్టు వచ్చిన వార్తలు నిజంకాదని స్పష్టం చేసింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ బ్రాతో ఓ సీన్లో నటించలేదని, కాబట్టి ఈ సీన్‌ను సెన్సార్ బోర్డు కట్ చేసే అవకాశమేలేదని మెహ్రా చెప్పింది. ఈ సినిమాలో ఎక్కడా అసభ్యకరదృశ్యాలు లేవని, సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపింది. సిద్ధార్థ మల్హోత్రా, కత్రినా కైఫ్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఏ సీన్‌ను కట్ చేయలేదని, కథలో మార్పులేదని సిద్ధార్థ చెప్పాడు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనుంది. భోజనం తక్కువగా తీసుకోవడంతో పాటు జిమ్‌లో బాగా కష్టపడ్డానని కత్రినా చెప్పింది. -
బ్రేకప్ను నేను ఎలా ఎదుర్కొన్నానంటే?
'నా కళ్లకు నువ్వే అలవాటు.. నువ్వు కనిపించకుంటే అవి వెతుక్కుంటాయి' (ఆంఖోంకో తేరి ఆదాత్ హై.. తునా దిఖే తో షికాయత్ హై).. తాజా సినిమా 'బార్ బార్ దేఖో'లోని ఈ పాట కత్రిన ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. గత ఏడాది వరకు ఆమె ఓ నటుడితో సన్నిహితంగా తిరిగింది. ప్రేమలో మునిగితేలింది. ఇద్దరూ ఒకే ప్లాటులో ఉండి సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ అకస్మాత్తుగా వారిద్దరూ వేరయ్యారు. ఒకరికొకరు ఎదురుపడలేనంత దూరమయ్యారు. బాలీవుడ్ ప్రేమపక్షులు పేరొందిన కత్రినాకైఫ్-రణ్‌బీర్ కపూర్ గత ఏడాది చివర్లో బ్రేకప్ జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి, రణబీర్‌తో వేరయిన తర్వాత కత్రిన ఎలా గడిపింది? ఈ బ్రేకప్ అనంతర పరిణామాలను ఎలా ఎదుర్కొంది? ఆ డిప్రెషన్ నుంచి ఎలా కోలుకుంది? తదితర విషయాలపై కత్రిన స్పందించింది. 'నేను తరచూగా జిమ్‌కు వెళ్లి వ్యాయమాలను చేశాను. తద్వారా దానిని (బ్రేకప్ను) ఎదుర్కొన్నారు' అని ఆమె ఓ మీడియా సంస్థకు తెలిపింది. బ్రేకప్ అనంతరం కత్రిన చేసిన ఈ కసరత్తు ఊరికే పోలేదు. తన తాజా సినిమా "బార్ బార్ దేఖో'లో మరింతగా బ్యూటీఫుల్‌గా దర్శనమిచ్చింది ఈ సుందరి. తనకంటే వయస్సులో చిన్నవాడైన సిద్ధార్థ్ కపూర్‌తో జత కట్టిన ఈ అమ్మడు.. అతనికి ఈడు-జోడుగా అలరించింది. హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల కనులవిందు చేసింది. ఇప్పటికే సిద్ధార్థ్-కత్రిన జోడీ కలిసి ఆడిపాడిన 'కాలాచష్' పాట ఆన్లైన్లో దుమ్మురేపుతుండగా.. తాజాగా బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా హల్చల్ చేస్తోంది. వయస్సు పెరుగుతున్నా హీరోయిన్గా తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా ట్రైలర్‌తో కత్రిన మరోసారి చాటింది. -
మళ్లీ మళ్లీ చూసేలా...!
‘బార్ బార్ దేఖో’... అంటే తెలుగులో ‘మళ్లీ మళ్లీ చూడు’ అని అర్థం. సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఇది. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని కత్రినా కైఫ్ స్టిల్స్ బయటకు రావడం ఆలస్యం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఆ స్టిల్స్‌నే చూస్తున్నారు. తనకంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కత్రినా సరిజోడీ అనిపించుకున్నారని స్టిల్స్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఏప్రిల్ నెలలో విడుదలైంది. ఈ నెల 27న ‘కాలా చష్మా..’ అనే పాటను విడుదల చేస్తు న్నారు. ఇక్కడున్న స్టిల్ ఆ పాటలోదే. నల్లటి కళ్లద్దాలు.. చేతికి గాజులు.. దేశీ డ్రస్సింగ్ స్టైల్.లో కత్రినా లుక్ సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ‘చిక్నీ చమేలీ..’ని గుర్తుకు తెస్తున్నాయి కదూ. అందులో కత్రినా స్టెప్పులకు విపరీతమైన స్పందన లభించింది. అందుకే ‘కాలా చష్మా..’లోనూ అదిరిపోయే స్టెప్స్ వేసి ఉంటారని ఆమె అభిమానులు ఊహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్లో సిద్ధార్థ్, కత్రినాల మధ్య సమ్‌థింగ్ ఏదో జరుగుతోందని వార్తలు రావడం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.