
రెండో రోజు పెరిగిన కలెక్షన్లు
కత్రినా కైఫ్, సిద్ధార్థ మల్హోత్రా నటించిన బాలీవుడ్ సినిమా 'బార్ బార్ దేఖో' తొలి రెండు రోజుల్లో భారత్లో 14.46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. తొలిరోజు 6.81 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో రోజు 7.65 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆదివారం కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లు రావచ్చని భావిస్తున్నారు.
నిత్యా మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ రోమాంటిక్ డ్రామా ఫిల్మ్ 'బార్ బార్ దేఖో'లో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ డిఫరెంట్ లుక్లో కనిపించింది. భోజనం తక్కువగా తీసుకోవడంతో పాటు జిమ్లో బాగా కష్టపడ్డానని కత్రినా చెప్పింది.