
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దివిసీమ ప్రాంతంలో జరుగుతోంది. ఇప్పటికే అవనిగడ్డకు చేరుకున్న చిత్రయూనిట్ మరో వారం రోజులు పాటు అక్కడే షూటింగ్ చేయనున్నారు.
దివిసీమ ఉప్పెన సమయంలో జరిగిన పరిణామానాలు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు అక్కడి ప్రజల కోసం విరాళాల సేకరణ లాంటి సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. హంసలదీవి, కోడూరులో షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ, సుమంత్, రానా దగ్గుబాటిలతో పాటు ఇతర నటీనటులు పాల్గొనున్నారు. బాలకృష్ణ ఎన్బీకే ఫిలింస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment