ఐదు రోజుల్లో 200 కోట్లకు పైగా వసూళ్లు | bang bang mints 200 crores in 5 days | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల్లో 200 కోట్లకు పైగా వసూళ్లు

Published Wed, Oct 8 2014 9:24 AM | Last Updated on Wed, Aug 21 2019 10:13 AM

ఐదు రోజుల్లో 200 కోట్లకు పైగా వసూళ్లు - Sakshi

ఐదు రోజుల్లో 200 కోట్లకు పైగా వసూళ్లు

బుల్లెట్లు ఎగిరాయి.. కార్లు పేలిపోయాయి.. కాళ్లు నర్తించాయి.. అన్నీ కలిపి నిర్మాతలకు కాసులు పండించాయి. అవును.. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే 201.51 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీసును పూర్తిస్థాయిలో కొల్లగొట్టింది. ఒక్క భారతదేశంలోనే దీని వసూళ్లు రూ. 156.41 కోట్లు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో కలిపి రూ. 45.10 కోట్లు వసూలు చేసిందని సినిమా వర్గాలు తెలిపాయి.

సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి అయిన మొత్తం ఖర్చు రూ. 140 కోట్లు. అంటే ఇప్పటికే నిర్మాతలకు 60 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. వాస్తవానికి సినిమా విడుదలైన రోజున విమర్శకుల నుంచి పెదవి విరుపులే కనిపించాయి. అసలు ఎందుకు తీశారో కూడా అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. కానీ తీరా ఇప్పుడు మాత్రం ఆ సినిమా అద్భుతమైన ఎంటర్టైనర్ అని, అందుకే ఇన్ని వసూళ్లు వస్తున్నాయని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement