Bang Bang
-
బ్యాంగ్ బ్యాంగ్.. ఎలా తయారు చేయాలంటే?
కావలసినవి: బేబీ పొటాటోస్ – పావు కేజీ; ఉప్పు – తగినంత; పంచదార – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); పసుపు – అర టీ స్పూను; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – మూడు; వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ: ► బేబీ పొటాటోస్‌ను శుభ్రంగా కడిగి ఉడికించి, చల్లారాక తొక్క తీయాలి ► ఒక పాత్రలో ఉప్పు, పంచదార, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ► బంగాళ దుంపలను అందులో వేసి దొర్లించాలి ► స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పచ్చి మిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి ► బేబీ పొటాటోలు జత చేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ► బేబీ పొటాటోస్ బంగారు రంగులోకి మారగానే దింపేయాలి. -
చాన్నాళ్లకు కొత్త సిన్మా
హృతిక్ రోషన్... ‘క్రిష్’, ‘ధూమ్’ సిరీస్‌ల ద్వారా చాలామందికి దగ్గరైన వెండితెర ‘జోధా అక్బర్’. కానీ, ఆయన వెండితెరపై కనిపించి ఏడాది పైనే అయిపోయింది. దాదాపు 17 ఏళ్ళ వైవాహిక బంధం విచ్ఛిన్నమై, విడాకులు తీసుకోవాల్సి రావడంతో హృతిక్ సహజంగానే దిగులు పడ్డారు. 2014 అక్టోబర్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ తరువాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు ఆయన రానే లేదు. అయితే, ఇప్పుడు మళ్ళీ తెరపై పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. హీరోయిన్ యామీ గౌతమ్‌తో కలసి ‘కాబిల్’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ తండ్రీ, దర్శక - నిర్మాత రాకేశ్ రోషన్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ని మళ్ళీ తెరపైకి తెచ్చిన ‘జజ్బా’ చిత్ర దర్శకుడు సంజయ్ గుప్తాయే దీనికీ దర్శకుడు. ‘‘ ‘కాబిల్’ ద్వారా సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. నేను, యామీ గౌతమ్ జంటగా దుమ్ము రేపుతామని ఆశిస్తున్నా’’ అని హృతిక్ పేర్కొన్నారు. మొత్తానికి, కొత్త సినిమాతో మళ్ళీ నటజీవితంపై దృష్టి సారిస్తున్న హృతిక్‌కు ఆల్ ది బెస్ట్! -
రూ.290 కోట్లు దాటిన 'బ్యాంగ్ బ్యాంగ్' వసూళ్లు !
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో నిర్మించిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 290.97 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 154.68 కోట్ల రూపాయలు (గ్రాస్ రూ.221 కోట్లు) వసూలు చేసింది. ఈ నెల 2న విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో 70 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని 140 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. ఈ చిత్రాన్ని భారత్‌తోపాటు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, పాకిస్తాన్లలో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. -
ఐదు రోజుల్లో 200 కోట్లకు పైగా వసూళ్లు
బుల్లెట్లు ఎగిరాయి.. కార్లు పేలిపోయాయి.. కాళ్లు నర్తించాయి.. అన్నీ కలిపి నిర్మాతలకు కాసులు పండించాయి. అవును.. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే 201.51 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీసును పూర్తిస్థాయిలో కొల్లగొట్టింది. ఒక్క భారతదేశంలోనే దీని వసూళ్లు రూ. 156.41 కోట్లు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో కలిపి రూ. 45.10 కోట్లు వసూలు చేసిందని సినిమా వర్గాలు తెలిపాయి. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి అయిన మొత్తం ఖర్చు రూ. 140 కోట్లు. అంటే ఇప్పటికే నిర్మాతలకు 60 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. వాస్తవానికి సినిమా విడుదలైన రోజున విమర్శకుల నుంచి పెదవి విరుపులే కనిపించాయి. అసలు ఎందుకు తీశారో కూడా అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. కానీ తీరా ఇప్పుడు మాత్రం ఆ సినిమా అద్భుతమైన ఎంటర్టైనర్ అని, అందుకే ఇన్ని వసూళ్లు వస్తున్నాయని అంటున్నారు. -
బాక్సాఫీస్ ‘బ్యాంగ్’
టాక్ పాజిటివ్‌గా లేకపోయినా... బాలీవుడ్ డ్రీమ్ బాయ్ హృతిక్ రోషన్, సెక్సీ తార కత్రినాకైఫ్‌ల తాజా చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. నాలుగు రోజుల్లోనే 94.13 కోట్లు వసూలు చేసి సెంచరీ వైపు పరుగెడుతోంది. ఈ ఏడాది హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన ఏడో చిత్రంగా రికార్డులకెక్కింది. వసూళ్లలో ఇప్పటికే అక్షయ్‌కుమార్ ‘ఎంటర్టైన్మెంట్’, అలియాభట్, వరుణ్‌ధావన్‌ల ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా, ప్రియాంక చోప్రా, అర్జున్ కపూర్ ‘గూండే’ చిత్రాలను అధిగమించినట్టు కోయిమోయి డాట్ కామ్ కథనం. -
నాలుగు రోజుల్లో 175 కోట్ల కలెక్షన్లు!
సినిమా రివ్యూలలో ఎన్ని విమర్శలు వచ్చినా, అసలు ఎందుకు చూడాలో అర్థం కావట్లేదంటూ విమర్శకులు జోకులు పేల్చినా.. హృతిక్ రోషన్ - కత్రినా కైఫ్ జంటగా మరోసారి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం మాత్రం కోట్లు కుమ్మరిస్తోంది. 140 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 175.61 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. ఇందులో భారత దేశంలో 134.47 కోట్లు, విదేశాల్లో 41.14 కోట్లు వసూలు చేసిందని సినిమా వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా.. హాలీవుడ్లో వచ్చిన 'నైట్ అండ్ డే' సినిమాకు రీమేక్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఎంతో మెచ్చుకున్నారు. హృతిక్ రోషన్ ఈ సినిమాలో అన్నిచోట్లా సూపర్ స్టార్ అనిపించాడని, అతడి ప్రతి ఒక్క కదలికా సినిమాకు డబ్బులు తెస్తోందని ట్వీట్ చేశాడు. ఈ యాక్షన్ థ్రిల్ల్రర్ సినిమాలో డానీ డెంజోంగ్పా, జావేద్ జాఫ్రీ, దీప్తి నావెల్, కన్వల్జిత్ సింగ్, జిమ్మీ షేర్గిల్ లాంటి అలనాటి నటులు కూడా నటించారు. Hrithik Roshan has superstar all over his demeanour!!! His every move in #bangbang is bang for the buck!!!! — Karan Johar (@karanjohar) October 5, 2014 -
సినిమా రివ్యూ: బ్యాంగ్ బ్యాంగ్
నటీనటులు: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, డాని డెన్ జోంగ్ పా సినిమాటోగ్రఫి: వికాస్ శివరామన్, సునీల్ పటేల్ సంగీతం: విశాల్-శేఖర్ బ్యాగ్రౌండ్ స్కోర్: సలీం సులేమాన్ దర్శకుడు: సిద్ధార్థ్ ఆనంద్ బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా రూపొందిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం ఫస్ట్ లుక్, టీజర్స్ దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు చేరుకుందా అని తెలుసుకునే ముందు కథ ఎంటో తెలుసుకుందాం! కథ: లండన్ లోని కోహినూర్ వజ్రాన్నిరాజ్ వీర్ (హృతిక్ రోషన్) దొంగిలిస్తాడు. కోహినూర్ వజ్రాన్ని దక్కించుకునేందుకు రాజ్ వీర్ వెనుక అంతర్జాతీయ మాఫియా డాన్ ఓమర్ జాఫర్ (డాని), హమీద్ గుల్ (జావెద్ జాఫ్రీ) ల గ్యాంగ్ వెంటాడుతుంది. అయితే మాఫియా గ్యాంగ్ కు చిక్కకుండా ఓమర్ జాఫర్ ను ఎలాగైనా కలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఓమర్ జాఫర్ ను ఎందుకు కలుసుకోవాలనుకుంటాడు? మాఫియా ఛేజింగ్ లో రాజ్ వీర్ తో హర్లీన్ (కత్రినా కైఫ్) ఎందుకు కలిసింది? రాజ్ వీర్ కోహినూర్ ఎందుకు దొంగిలించాడు? చివరికి కోహినూర్ వజ్రం కథ ఏంటి అనే ప్రశ్నలకు తెరమీద సిద్ధార్థ్ ఆనంద్ ఆవిష్కరించిన దృశ్య రూపమే 'బ్యాంగ్ బ్యాంగ్'. ప్లస్ పాయింట్స్: హృతిక్, కత్రినాల కెమిస్ట్రీ యాక్షన్ సీన్లు ఫోటోగ్రఫి మ్యూజిక్ కథనం మైనస్ పాయింట్స్: కథ విలనిజం నటీనటుల ఫెర్ఫార్మెన్స్: రాజ్ వీర్ గా హృతిక్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా కనిపించాడు. 'సిక్స్ ప్యాక్' హృతిక్ యాక్షన్ సీన్లలో హాలీవుడ్ స్థాయి ఫెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించాడు. యాక్షన్ సీన్లతోపాటు కత్రినాతో హాట్ హాట్ గా రొమాన్స్ చేశాడు. యాక్షన్ హీరోగా హృతిక్ తన సత్తాను మరోసారి సినీ ప్రేక్షకులకు రుచి చూపించాడు. ధూమ్-3 చిత్రంలో గ్లామర్ తో అదరగట్టేసిన కత్రినా 'బ్యాంగ్ బ్యాంగ్' లో ప్రదర్శించిన అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. హృతిక్ తో లిప్ లాక్, యాక్షన్, రొమాంటిక్ సీన్లలోనూ కత్రినా విజృంభించింది. పెద్గగా యాక్టింగ్ కు స్కోప్ లేకపోవడం, గ్లామర్ తోనే కత్రినా సంతృప్తి పరిచింది. డానీ, జావేద్ జాఫ్రీల విలనిజం గురించి పెద్దగా చెప్పుకునేంతగా ఏమి లేదు. సాంకేతిక విభాగాల పనితీరు: విశాల్-శేఖర్ సంగీతం, సలీం సులేమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకు జీవం పోశాయి. తూ మేరి, మెహర్ బాన్, బ్యాంగ్ బ్యాంగ్, ఉఫ్ పాటలు యువతకు జోష్ తోపాటు కిక్కెంచే విధంగా ఉన్నాయి. విశాల్-శేఖర్ అందించిన బాణీలకు వికాస్ శివరామన్, సునీల్ పటేల్ ల సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సీన్లు, విదేశాల్లో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు, ముఖ్యంగా జల విన్యాసాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని గురి చేస్తాయి. దర్శకత్వం: హాలీవుడ్ చిత్రం 'నైట్ అండ్ డే' చిత్ర ఆధారంగా సిద్దార్థ్ ఆనంద్ 'బ్యాంగ్ బ్యాంగ్' ను రూపొందించారు. యాక్షన్, రొమాన్స్ ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ చిత్రంలోని కథపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం ప్రధాన లోపంగా మారింది. కేవలం స్క్రీన్ ప్లే ఆధారంగా ఓ ఛేజింగ్ లా సాగిన ఈ చిత్రం తొలి భాగంలో ట్రెడిషినల్ ఆడియన్స్ రోటిన్ గా అనిపించడమే కాకుండా, ప్రేక్షకులకు కొంత విసుగును తెప్పిస్తుంది. అయితే చిత్ర రెండవ భాగంలో ఓ ట్విస్ట్ తో బ్యాంగ్ బ్యాంగ్ అనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చివర్లో కొంత సెంటిమెంట్ బ్యాంగ్ బ్యాంగ్ జోడించి ప్రేక్షకులతో ఓకే అనిపించుకోవడంలో సిద్దార్థ్ ఆనంద్ సఫలమయ్యారు. కేవలం యూత్ ను టార్గెట్ గా చేసుకుని నిర్మించిన ఈ చిత్ర విజయం కేవలం యాక్షన్, హృతిక్-కత్రినాల కెమిస్ట్రిపైనే ఆధారపడి ఉంటుంది. వంద కోట్ల క్లబ్ లో బ్యాంగ్ బ్యాంగ్ చేరడమనేది సాధారణ విషయమే.. అయితే యూత్, రెగ్యులర్ ఆడియెన్స్ ఆదరణ లభిస్తే 'బ్యాంగ్ బ్యాంగ్' భారీ కలెక్షన్లు కొల్లగొడుతుందనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు ముగింపు: కథ లేకుండా కేవలం హృతిక్ ఇమేజ్, కత్రినా గ్లామర్, యాక్షన్ సీన్లే ఈ చిత్రంలో కీలక అంశాలు. అంతకంటే అతిగా ఆశపడి థియేటర్ కెళ్లే ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. తెరపై హృతిక్ రోషన్ లో పరకాయ ప్రవేశం చేస్తే.. ప్రేక్షకుడికి బోలెడంత వినోదంతోపాటు ప్రేక్షకుడికి గిలిగింతలు కలగడం ఖాయం. -
ఈ సినిమా ఖర్చు రూ.140 కోట్లు
ప్రపంచంలోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలో నటించడానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పింది బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. సుమారు ఏడాదిపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఫైట్లు చాలా డిఫెరెంట్‌గా ఉంటాయని తెలిపింది. ఇందులో తన నటన అభిమానులను ఆకట్టుకుంటుందనే ధీమాను ఆమె వ్యక్తం చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం నిర్మాతలు సుమారు రూ.140 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమా కోసం మంచి ప్రతిభ ఉన్న టెక్నీషియన్లు చాలా కష్టపడ్డారని, ప్రతి ఫ్రేమ్‌లో ఆ కష్టం కనిపిస్తుందని కత్రినా తెలిపింది. ఈ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టుడియోస్ నిర్మించింది. ఈ సినిమా వచ్చే నెల రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ.. బ్యాంగ్ బ్యాంగ్ సినిమా టైటిల్ వినడానికి, చూడటానికి యాక్షన్ సినిమాలా అనిపించినా అంతర్లీనంగా ఇందులో ప్రేమకథ ఇమిడి ఉందని చెప్పింది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్‌తోపాటు స్టోరీలైన్ తనను ఎంతగానో ఆకట్టుకుందని కత్రినా తెలిపింది. అందుకే ఇందులో పనిచేయడానికి అడగ్గానే ఒప్పేసుకున్నానని చెప్పింది. బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలో తాను పాల్గొన్న స్టంట్ సన్నివేశాల్లో చాలావరకు తాను పాల్గొన్నానని తెలిపింది. వీలైతే మహిళా ప్రధానమైన యాక్షన్ సినిమాలో చేయాలని తనకు ఉందని చెప్పింది. ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో వస్తే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించేందుకు తాను సిద్ధమని చెప్పింది. ఫైట్లు, యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి కావాల్సిన శిక్షణ తీసుకునేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పింది. కాగా, కత్రినా ఇంతకు ముందు నటించిన నమస్తే లండన్, తీస్ మార్ఖాన్, ధూమ్ 3, వీర్ వంటి సినిమాలు అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. -
ఆ సినిమాకు చాలా కష్టపడ్డా
న్యూఢిల్లీ: హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రంలో నటించడానికి చాలా కష్టపడ్డానని ఆ చిత్ర హీరోయిన్ కత్రినా కైఫ్ తెలిపింది. ప్రపంచంలోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో పని చేయడం కోసం మిగతా చిత్రాల కంటే ఎక్కువ కష్టించాల్సి వచ్చిందని పేర్కొంది. సుమారు ఏడాదిపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఫైట్లు చాలా కొత్తగా ఉంటాయని తెలిపింది. ఇందులో తన నటన అభిమానులను తప్పక ఆకట్టుకుంటుందనే ధీమాను వ్యక్తం చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం నిర్మాతలు సుమారు రూ.140 కోట్లు ఖర్చు పెట్టారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టుడియోస్ నిర్మించింది. ఈ సినిమా వచ్చే నెల రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
రూటు మారుస్తున్న హీరోయిన్లు...
-
అదృష్టవంతురాలిని...
ముంబై: తాను నటించిన సినిమాల్లో అనేకం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయని, అందువల్ల తానెంతో అదృష్టవంతురాలినని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గర్వంగా చెప్పింది. 31 ఏళ్ల కత్రినా నటించిన ‘ధూమ్-3’, ‘ఏక్ థా టైగర్’, జబ్ తక్ హై జాన్’, ‘రాజ్‌నీతి’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ‘బాక్సాఫీస్ వద్ద విజయం అనేది నాకొక విషయమే కాదు. ప్రతి ఒక్కరూ తమ సినిమాలు హిట్ కావాలని ఆశిస్తారు. ఎందుచేతనంటే వారు ఆ సినిమా కోసం ఎంతో కష్టపడి ఉంటారు. ఈ రంగంలో ఉన్నవారు దేనినైనా మనస్ఫూర్తిగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే నా అదృష్టం ఏమిటంటే ఇప్పటివరకూ రెండో కోణం ఎదురుకాకపోవడం. నేను నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా తదుపరి సినిమాకూడా అదే జాబితాలోకి చేరుతుందని ఆశిస్తున్నా. ఎంతో కష్టపడి నటించిన తర్వాత కూడా సినిమా ఆడకపోతే ఎవరికైనా గుండె పిండి అవుతుంది. అది అంత మంచిది కూడా కాదు’ అని అంది. ఇండస్ట్రీలో నంబర్ అనిపించుకునే స్థాయిలో ఉన్న కత్రినా...ప్రేక్షకులు తనను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మురిసిపోతోంది. అయితే ప్రేక్షకులు నటులను ఆదరించాలని, ఆమోదించాలని చెబుతోంది. ‘ప్రేక్షకుల ఆమోదముద్ర అనేది నాకు ఎంతో ముఖ్యం. మన ప్రేక్షకులు నిజాయితీ కలిగినవారు. అవలీలగా క్షమించేస్తారు. వారు ఎంతో మంచివారు కూడా. నటన బాగుంటే ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు’అని అంది.కాగా కత్రినా తాజాగా నటించిన ‘బిగ్ బ్యాంగ్’ సినిమా వచ్చే నెల రెండో తేదీన విడుదల కానుంది. -
సుజానే తో విడిపోవడం... : హృతిక్
కెరీర్ లో ఫెయిల్యూర్స్, వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనలు, బ్రెయిన్ సర్జరీ తదితర అంశాలు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ఈ సంవత్సరం కష్టాల్లోకి నెట్టాయి. భార్య సుజానే తో విభేధాల కారణంగా హృతిక్ రోషన్ విడిపోవడంతో ఎమోషనల్ గా ఒత్తిడి గురయ్యాని.. అప్పుడే తాను మానసికంగా బలంగా తయారయ్యాను అని హృతిక్ తెలిపారు. బ్యాంగ్ బ్యాంగ్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తన కేరిర్ లో అత్యంత ఉత్తేజకరమైన చిత్రం అని అన్నారు. ఈ చిత్రంలో చాలా సంతోషకరమైన కారెక్టర్ ను పోషించానని తెలిపారు. తన జీవితంలో చాలా గడ్డు పరిస్థుతులు ఎదుర్కొనే సమయంలో ఇలాంటి పాత్ర దొరకడం కొంత రిలీఫ్ ఇచ్చిందన్నారు. ఈ చిత్ర ప్రయాణం జీవితంలో గొప్ప విజయం లాంటిదన్నారు. ఇలాంటి సవాళ్లను అధిగమించినపుడు అలాంటి సంఘటనలు చాలా తేలికవుతాయన్నారు. తనకు సల్మాన్ ఖాన్ కు ఎలాంటి విభేదాలు లేవని హృతిక్ స్పష్టం చేశారు. -
నన్ను నేను అబ్బాయిననుకుంటా..!
ఇవాళ్టికీ మా అమ్మంటే నాకు అత్యంత ప్రేమ. అలాగే, నా అక్కచెల్లెళ్ళను కూడా అంతేలా ప్రేమిస్తాను. మొదటి నుంచి నన్ను నేను అబ్బాయిని అనుకుంటాను. అందుకే, కుటుంబానికి అండగా నిలబడి, పోషించడం నా బాధ్యతగా భావిస్తాను. మా కుటుంబానికి ఎదురైన ఆర్థిక ఇబ్బందులన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోగలిగినందుకు నేనెంతో గర్విస్తుంటాను. అయితే, నేనూ ఆడపిల్లనే కదా! ఒక్కోసారి నాలోని స్త్రీ సహజమైన బేలతనం బయటపడి వెక్కిరిస్తుంటుంది. టీనేజ్లోనే వెండితెర మీదకు వచ్చి, హిందీలోనే కాక, తెలుగులోనూ (వెంకటేశ్‌తో ‘మల్లీశ్వరి’) నటించి, అశేష అభిమానుల్ని సంపాదించుకున్న అందాల తార కత్రినా కైఫ్. ఒక పక్క హిందీ సినిమాలతో, మరో పక్క హీరో రణ్‌బీర్ కపూర్‌తో సాన్నిహిత్యం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారామె. రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రం ప్రచారంతో బిజీగా ఉన్న 31 ఏళ్ళ ఈ సౌందర్య రాశి తాజాగా తన బాల్యం, సినీ జీవితపు తొలి రోజులు, ఆలోచనా విధానం, రణ్‌బీర్ కపూర్‌తో సాన్నిహిత్యం గురించి ఎన్నో సంగతులు వెల్లడించారు. ఏ నేను పుట్టింది హాంగ్‌కాంగ్‌లో. మా అమ్మ బ్రిటీషు వనిత. మా నాన్న గారేమో భారతీయులు. మేము ఆరుగురు అక్కచెల్లెళ్ళం. మాకు ఒక సోదరుడు. నా తోబుట్టువుల్లో ముగ్గురు నా కన్నా చిన్న. నా బాల్యంలోనే మా అమ్మా నాన్న విడిపోయారు. ఏ మా అమ్మ లాభాపేక్ష రహితమైన అనేక సేవా సంస్థల్లో పని చేస్తుంటుంది. కొన్నేళ్ళ క్రితం తమిళనాడు తీరంలో సునామీ బీభత్సం సృష్టించినప్పుడు ఆమె తొలిసారిగా భారతదేశానికి వచ్చింది. మదురైలో ఆరేడేళ్ళు ఉండి, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకొంది. సునామీ బాధిత కుటుంబాల పిల్లల కోసం ఒక పాఠశాల నిర్మాణంలో చురుకుగా పాల్గొంది. ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమం కోసం ఊరూరూ తిరిగే మా అమ్మ వల్ల పిల్లలమైన మేమందరం కూడా ఆమె వెంట దేశదేశాలు చుట్టేశాం. ఏ స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తల పిల్లలందరూ ఎలాగో మేమూ అలాగే చాలా సాదాసీదాగా పెరిగాం. పెరిగి పెద్దయి సొంత సంపాదన వచ్చే వరకు నేను షాపింగ్ మాల్స్‌కి కూడా వెళ్ళలేదంటే నమ్మండి. సొంతగా సంపాదించడం మొదలుపెట్టాకే కార్లలో తిరగసాగాను. లండన్‌లో మోడలింగ్ చేసిన తరువాత 17 ఏళ్ళ వయసులో ఒక మ్యాగజైన్‌కు మాడలింగ్ చేయడానికి తొలిసారిగా భారత్‌కు వచ్చాను. భారత్‌కు వచ్చే ముందు మూడేళ్ళూ నేనున్నది లండన్‌లోనే! ఏ అవకాశాల కోసం ముంబయ్‌లో తిరిగిన రోజులు కూడా నాకు గుర్తే. ముంబయ్‌లో అందరూ నాతో స్నేహపూర్వకంగా ఉన్నట్లు అనిపించింది. మొదటి రెండు నెలలూ నాకు అవకాశాలు రాలేదు. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఫరూఖ్ ఛోథియా సలహా మేరకు నా ఫోటోలు తీసుకుని మోడల్ కో-ఆర్డినేటర్లనూ, యాడ్ ఫిల్మ్‌ల ఏజంట్లనూ కలిశాను. ఔత్సాహిక మోడల్స్‌తో పాటు అలా క్యూలో నిల్చొని, అన్ని రకాల వాణిజ్య ప్రకటనలకూ ఆడిషన్ కోసం కష్టపడిన తరువాత ఫలితం దక్కింది. ఏ మోడలింగ్‌తో మొదలుపెట్టి కొన్నేళ్ళపాటు కష్టపడిన తరువాత హిందీలో తొలిసారిగా ‘సర్కార్’ చిత్రంలో చిన్నదైనా, మంచి పాత్ర లభించింది. సల్మాన్ ఖాన్‌తో కలసి నటించిన ‘మైనే ప్యార్ క్యోం కియా’ సినిమాతో నాకు తొలిసారిగా పెద్ద బ్రేక్ వచ్చింది. ఇక, అక్కడ నుంచి నా సినీ జీవితం ఎలా ముందుకు సాగిందో తెలిసిందే. నా సినీ జీవితపు తొలిరోజుల్లో ఆ యా చిత్రాల నటులు చేసిన సిఫార్సుల వల్ల కూడా చాలా అవకాశాలే వచ్చాయి. అప్పట్లో హీరో సల్మాన్ ఖాన్ కూడా నాకు అండగా నిలిచి అవకాశాలొచ్చేలా చేశారు. ఏ నేను స్వతహాగా తెలివైనదాన్నే. జీవితంలో ఆర్థిక భద్రత ముఖ్యమని నా నమ్మకం. అందుకే, చిన్న వయసు నుంచి పనిలో కష్టపడి, పైకి వచ్చాను. నా సొంత కాళ్ళ మీద నిలబడ్డాను. ఏ రంగం ఎంచుకున్నా అందులో నా ఉనికిని చాటుకోవాలనుకున్నాను. సినీ రంగం బాగా నచ్చడంతో అందులోనే నన్ను నేను చూసుకుంటూ స్థిరపడ్డాను. చిన్నప్పటి నుంచి పూర్తి శ్రద్ధతో పని చేయడం వల్ల మంచీ చెడూ గ్రహించడంతో గర్వం తలకెక్కలేదు. కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. కానీ, ఒక్కోసారి పరిస్థితులు మన చేతిలో లేకపోవడం వల్ల ఎంత కష్టపడినా ఫలితం ఉండకపోవచ్చు. అది గ్రహించాలి. ఏ ముందుగా నాకు ఆఫర్ చేసి, ఆ తరువాత మరొక నటికి వెళ్ళిన పాత్రల గురించి కానీ, ఆ సినిమాల గురించి కానీ నేనేప్పుడూ చెడ్డగా మాట్లాడను. జీవితంలో మనకంటూ కొన్ని నియమాలుండాలనీ, హుందాగా ప్రవర్తించాలనీ నా అభిప్రాయం. అయితే, ఒక దర్శకుడితో బాగా స్నేహం పెరిగిన తరువాత, ఆయన సినిమాలో నన్ను తీసుకోకపోతే మాత్రం భావోద్వేగానికి లోనవుతుంటా. ఏ ‘సావరియా’ చిత్రం విడుదలైనప్పటి నుంచి హీరో రణ్‌బీర్ కపూర్ నాకు తెలుసు. ఆయన కూడా నా లాగే స్నేహానికీ, స్నేహితులకూ ప్రాధాన్యమిస్తుంటారు. భావోద్వేగంతో ఉంటారు. అందరితో స్నేహంగా, సరదాగా, హుందాగా ఆయన నడుచుకొనే తీరు నాకెంతో నచ్చుతుంది. రణ్‌బీర్‌కు కూడా నా మనసు బాగా నచ్చుతుంది. ఒక పక్కన ఎంతో ప్రతిభావంతుడైన నటుడే కాక, తెలివైనవాడు, సున్నిత హృదయుడైన మంచి మనిషి కావడం వల్ల రణ్‌బీర్ అంటే నాకు ప్రాణం. -
కాసుల వర్షం ఖాయం
న్యూఢిల్లీ: కత్రినాకైఫ్, హృతిక్‌రోషన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’పై బాలీవుడ్లో అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ట్రెయిలర్స్ చూసిన తర్వాత సినీవిమర్శకులు సైతం ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ట్రెయిలర్స్ అద్భుతంగా ఉన్నాయని, హృతిక్, కత్రినా కెమిస్ట్రీ సూపర్బ్ అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ స్టంట్లు, శృంగార సన్నివేశాల్లో కత్రినా అందచందాలు చూడగానే ఆకట్టుకునేలా ట్రెయిలర్స్ ఉన్నాయని చెబుతున్నారు. బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పిలిచే ఆమిర్‌ఖాన్ కూడా ట్రెయిలర్స్ అద్భుతంగా ఉన్నాయని ట్వీట్ చేశాడంటే ఇక ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రచారం అక్కరలేదనే అంటున్నారు సినీవిశ్లేషకులు. ‘బ్యాంగ్ బ్యాంగ్ సినిమా ట్రెయిలర్స్ చూశా. చాలా అద్భుతంగా అనిపిం చాయి. హృతిక్ రోషన్ చేసిన డ్యాన్స్‌లో కనీసం సగం కూడా నేను చేయలేనేమో. సినిమాలో ఓ పాట నాకు చాలా బాగా నచ్చింది. ట్రెయిలర్స్ చూసినవారికి సినిమాపై అంచనాలు అమాతంగా పెరగడం ఖాయం. హృతిక్-కత్రినాకైఫ్ జంటపై జనాలు కాసుల వర్షం కురిపించడం ఖాయం. ప్రత్యేకించి.. చేతిలో గన్ పట్టుకొని హృతిక్ రోషన్ నీళ్లలోనుంచి దూసుకొచ్చే సన్నివేశం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ సీన్‌ను చూసిన తర్వాత కూడా అక్టోబర్ 2 వరకు ఆగడం నా వల్ల కాదు. ఆమిర్‌ఖాన్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘పీకే’ సినిమా ప్రచారంలో ఎంతో బిజీగా ఉన్నా బ్యాంగ్ బ్యాంగ్ సినిమా ట్రెయిలర్స్ కోసం తాను ఎంతగానో ఎదురుచూశానని, విడుదల కోసం కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. గతంలో కత్రినా-హృతిక్‌లు నటించిన ‘జిందగీ నా మిలేగీ దుబారా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించింది. దీంతో రెండోసారి వీరిద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ కూడా సక్సెస్ సాధిస్తుందని చెబుతున్నారు. -
హృతిక్ 'బ్యాంగ్ బ్యాంగ్' స్టిల్స్
-
ఐశ్వర్య బికినీ బలాదూర్ అట!
హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ ప్రచార చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. వీటిని తిలకించిన వారందరూ ‘మళ్లీ బాలీవుడ్ తెరపై కత్రినా హవా మొదలుకానుంద’ని తమ అభిప్రాయాలను ముక్తకంఠంతో వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచార చిత్రాల్లో కత్రినా చేసిన ఫీట్లు అలా ఉన్నాయి మరి. ‘క్రిష్’, ‘ధూమ్-2’ చిత్రాలను తలదన్నేలా ఇందులో హృతిక్ సాహసాలు చేస్తే... హృతిక్‌కు దీటుగా కత్రినా చేసిన విన్యాసాలు ఈ ట్రైలర్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఇవి మచ్చుకు మాత్రమే అనీ, సినిమాలో కత్రినా చేసిన ఫీట్స్ ఇంతకు మించేలా ఉంటాయని సినీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. కత్రినా స్విమ్ సూట్లో పది నిమిషాలకు పైగా కనిపించడం ‘బ్యాంగ్ బ్యాంగ్’లో మరో విశేషం. ‘ధూమ్’ సిరీస్‌లో ఐశ్వర్యా రాయ్, బిపాసా బసు కూడా స్విమ్ సూట్లో నటించిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలను మరపించేలా ఇందులోని స్విమ్ సూట్ సీన్ ఉంటుందని బాలీవుడ్ టాక్. పైగా ఆ సన్నివేశంలో హృతిక్‌తో కలిసి కత్రినా ఘాటుగా నటించిందని విశ్వసనీయ సమాచారం. అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళాల్లోనూ విడుదలయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్స్ బాగున్నా యంటూ దర్శకుడు రాజమౌళి సైతం వ్యాఖ్యా నించారు. -
24 గంటల్లో 20 లక్షల హిట్లు
ముంబై: బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ లు నటించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్ర టీజర్ యూట్యూబ్ లో హల్ చల్ సృష్టిస్తోంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల హిట్లను సొంతం చేసుకుంది. టామ్ క్రూయిజ్, కెమెరాన్ దియాజ్ నటించిన హాలీవుడ్ చిత్రం 'నైట్ అండ్ డే' చిత్ర ఆధారంగా బ్యాంగ్ బ్యాంగ్ రూపొందింది. యూట్యూబ్ లో 58 నిమిషాలపాటు అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అని హృతిక్ ట్వీట్ చేశారు. కత్రినాతో హృతిక్ మూడవ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో జిందగి నా మిలేగి దుబారా, అగ్నిపథ్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. -
బ్యాంగ్ బ్యాంగ్ ఫస్ట్ లుక్ అదుర్స్
-
మళ్లీ కెమిస్ట్రీ పండుతుందా?
హృతిక్ రోషన్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఓ పక్క భార్యతో విడాకులు, మరోపక్క స్వల్ప అనారోగ్య సమస్యల కారణంగా హృతిక్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. 2013 నవంబర్‌లో ‘క్రిష్ 3’ వచ్చింది. ఆ తర్వాత ఆయన కమిట్ అయిన సినిమా ‘బాంగ్ బాంగ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోమవారం విడులైంది. ఈ ప్రచార చిత్రం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ తర్వాత హృతిక్, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఇది. ఆ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ ప్రచార చిత్రంలో కూడా మంచి కెమిస్ట్రీ కనిపిస్తోందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకి రావడానికి కారణంగా నిలిచేవాటిలో ప్రచార చిత్రాలకు ప్రధాన స్థానమే ఉంటుంది. ఆ పరంగా చూసుకుంటే ఈ ప్రచార చిత్రం వందకు వంద మార్కులు కొట్టేసింది. ఫలితంగా చిత్రంపై భారీ అంచనాలు ఆరంభమయ్యాయి. అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి.. అంచనాలను ఏ మేరకు నిజం చేస్తుందో వేచి చూడాల్సిందే! -
హృతిక్, కత్రినాల కెమిస్ట్రీ కేక!