కాసుల వర్షం ఖాయం | Bollywood exposure on 'Bang Bang' trailers | Sakshi
Sakshi News home page

కాసుల వర్షం ఖాయం

Published Tue, Sep 2 2014 10:47 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కాసుల వర్షం ఖాయం - Sakshi

కాసుల వర్షం ఖాయం

న్యూఢిల్లీ: కత్రినాకైఫ్, హృతిక్‌రోషన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’పై బాలీవుడ్‌లో అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ట్రెయిలర్స్ చూసిన తర్వాత సినీవిమర్శకులు సైతం ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ట్రెయిలర్స్ అద్భుతంగా ఉన్నాయని, హృతిక్, కత్రినా కెమిస్ట్రీ సూపర్బ్ అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు.

 యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ స్టంట్లు, శృంగార సన్నివేశాల్లో కత్రినా అందచందాలు చూడగానే ఆకట్టుకునేలా ట్రెయిలర్స్ ఉన్నాయని చెబుతున్నారు. బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పిలిచే ఆమిర్‌ఖాన్ కూడా ట్రెయిలర్స్ అద్భుతంగా ఉన్నాయని ట్వీట్ చేశాడంటే ఇక ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రచారం అక్కరలేదనే అంటున్నారు సినీవిశ్లేషకులు. ‘బ్యాంగ్ బ్యాంగ్ సినిమా ట్రెయిలర్స్ చూశా. చాలా అద్భుతంగా అనిపిం చాయి. హృతిక్ రోషన్ చేసిన డ్యాన్స్‌లో కనీసం సగం కూడా నేను చేయలేనేమో. సినిమాలో ఓ పాట నాకు చాలా బాగా నచ్చింది. ట్రెయిలర్స్ చూసినవారికి సినిమాపై అంచనాలు అమాతంగా పెరగడం ఖాయం.

హృతిక్-కత్రినాకైఫ్ జంటపై జనాలు కాసుల వర్షం కురిపించడం ఖాయం. ప్రత్యేకించి.. చేతిలో గన్ పట్టుకొని హృతిక్ రోషన్ నీళ్లలోనుంచి దూసుకొచ్చే సన్నివేశం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఆ సీన్‌ను చూసిన తర్వాత కూడా అక్టోబర్ 2 వరకు ఆగడం నా వల్ల కాదు.  ఆమిర్‌ఖాన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘పీకే’ సినిమా ప్రచారంలో ఎంతో బిజీగా ఉన్నా బ్యాంగ్ బ్యాంగ్ సినిమా ట్రెయిలర్స్ కోసం తాను ఎంతగానో ఎదురుచూశానని, విడుదల కోసం కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. గతంలో కత్రినా-హృతిక్‌లు నటించిన ‘జిందగీ నా మిలేగీ దుబారా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించింది. దీంతో రెండోసారి వీరిద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ కూడా సక్సెస్ సాధిస్తుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement