ఎలా అనిపిస్తే అలా చేస్తా: కత్రినా
ముంబై: కొత్త సినిమా ప్రాజెక్టుపై సంతకం చేసే ముందు అందులోని నటులెవరు, స్క్రిప్టు ఎలా ఉందనే విషయాన్ని తాను పట్టించుకోనని బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ చెప్పింది. ఆ సమయానికి తన మనసుకు ఎలా అనిపిస్తే అలా చేస్తానంది. ‘లెక్కలేమీ వేయను. స్క్రిప్టునీ చదవను. ఆ సమయంలో నేను అవునని చెప్పానంటే నేను చేయాల్సింది అదేనని నా మనసుకు అనిపించి ఉండొచ్చు. ‘ధూమ్-3’సినిమాకి సంతకం చేసినపుడు కారులో ప్రయాణిస్తూ ఉన్నా. ఓ పాటను ఆస్వాదిస్తున్నా.
పాటల్లోనూ విభిన్నంగా చేయాలని అనిపించింది. ఆ సినిమాలో అదే చేశా’ అని అంది. హృతిక్ రోషన్‌తో కలసి కత్రినా నటించిన బ్యాంగ్ బ్యాంగ్ సినిమా ఇటీవల విడుదలైంది. కత్రినా కథానాయికగా ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో ఇద్దరు ీహ రోలూ ఖాన్‌లే. ‘ధూమ్-3’లో ఆమిర్‌ఖాన్ ‘జబ్ తక్ హై జాన్’లో షారుఖ్‌ఖాన్ కథానాయకులు. ఆ తర్వాత ‘ఏక్ థా టైగర్’ సినిమాలో సల్మాన్‌ఖాన్ కథానాయకుడు. వీరే కథానాయకులుగా ఉండడానికిగల కారణమేమిటని మీడియా ప్రశ్నించగా స్క్రిప్టును బట్టే అవన్నీ ఉంటాయంది. ‘నటీనటులను ముందుగా ఎంచుకున్న తర్వాతే నిర్మాతలు నావద్దకు వస్తున్నారని భావించడం లేదు.
ఈ మధ్యకాలంలో విడుదలైన నా ఐదు సినిమాలకు సంబంధించి సంతకాలు చేసే సమయంలో నేను ప్రయాణంలోనే ఉన్నా. స్రిప్టు బాగుంటే అందరూ పెద్ద స్టార్‌లే ఉంటారు. నేను నటించే సినిమాలో కథనాయకుడు ఎవర నే విషయాన్ని పట్టించుకోను. నా తదుపరి సినిమా ‘ఫిట్‌ఫ్లోర్’కథానాయకుడిగా తొలుత అభిషేక్ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టుపై నేను సంతకం చేసిన తర్వాత అతడిని కాదని ఆదిత్యరాయ్ కపూర్‌ని ఎంపిక చేశారు. అప్పటికి నేను ఆషిఖి-2 సినిమా చూడనే లేదు. అయినప్పటికీ అలా ఎందుకు జరిగిందని నేను దర్శకుడిని ప్రశ్నించలేదు.’ అని తెలిపింది.