హృతిక్‌తో డ్యాన్స్ సవాలే..! | Katrina Kaif: It was a challenge to dance with Hrithik Roshan | Sakshi
Sakshi News home page

హృతిక్‌తో డ్యాన్స్ సవాలే..!

Published Thu, Sep 18 2014 11:01 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

హృతిక్‌తో డ్యాన్స్ సవాలే..! - Sakshi

హృతిక్‌తో డ్యాన్స్ సవాలే..!

బాలీవుడ్ నటుడు హృతిక్‌తో కలిసి డ్యాన్స్ చేయడం సవాలుతో కూడుకున్న విషయమని చెబుతోంది బాలీవుడ్ ‘షీలా’. బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో కత్రినా, హృతిక్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హృతిక్ కొన్ని అద్భుతమైన స్టెప్పులు వేశాడని, ప్రత్యేకించి ఆక్టెయిన్ డ్యాన్స్ స్టెప్పులు సూపర్బ్‌గా ఉన్నాయంటోంది కత్రినా.  హాలీవుడ్ చిత్రం ‘నైట్ అండ్ డే’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కత్రినా కథానాయిక పాత్రను పోషిస్తోంది. చిత్ర విశేషాల గురించి కత్రినా చెబుతూ... ‘బ్యాంగ్ బ్యాంగ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డ్యాన్స్ గురించే.
 
 హృతిక్‌తో కలిసి డ్యాన్స్ చేయాలంటే నాకు పెద్ద సవాలుగా అనిపించింది. హృతిక్ కదలికలు అద్భుతం. మిగతా డ్యాన్స్ స్టెప్పులకు ఇవి భిన్నంగా ఉంటాయి. ఈ స్టెప్పులు వేసేందుకు హృతిక్ పెద్దగా కష్టపడినట్లు అనిపించలేదు. సహజంగానే అతను ఓ మంచి డ్యాన్సర్ కావడమే ఇందుకు కారణమేమో. అవి హృతిక్‌లోని సత్తాను చాటిచెబుతాయి. రిహార్సల్స్ సమయంలో నేను చాలా బాగా చేస్తున్నాననిపించేది. అయితే ఫైనల్ షూటింగ్‌కు వచ్చేసరికి హృతిక్ స్టెప్పులు అద్భుతంగా అనిపించేవి.
 
 ఎటువంటి రిహార్సల్స్ చేయకుండానే హృతిక్ అద్భుతంగా చేసేవాడు. ఇప్పటికే ధూమ్ సినిమాలో తన డ్యాన్స్‌తో దుమ్ము దులిపాడ’ని చెప్పింది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను బుధవారం రాత్రి విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సలామ్ నమస్తే’ను తెరకెక్కించిన సిద్ధార్థ్‌రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ఆనంద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సినిమాను తెరకెక్కిస్తుండడంతో హృతిక్, కత్రినా అభిమానులు కూడా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement