అతనితో డ్యాన్స్ చేయడం ఒక సవాల్! | It was a challenge to dance with Hrithik, Katrina Kaif | Sakshi
Sakshi News home page

అతనితో డ్యాన్స్ చేయడం ఒక సవాల్!

Published Thu, Sep 18 2014 3:52 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అతనితో డ్యాన్స్ చేయడం ఒక సవాల్! - Sakshi

అతనితో డ్యాన్స్ చేయడం ఒక సవాల్!

ముంబై:బాలీవుడ్ లో తన డ్యాన్స్ తోనే ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న నటుడు హృతిక్ రోషన్. ప్రస్తుతం 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రంలో హృతిక్ సరసన కత్రినా కైఫ్ నటిస్తోంది. గతంలో 'జిందగీ న మిలేగీ దొబారా'లో నటించిన ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అయితే హృతిక్ తో డ్యాన్ చేయడం మాత్రం చాలా కష్టమంటోంది కత్రినా కైఫ్. హృతిక్ తో డ్యాన్స్ చేయడమనేది ఒక ఛాలెంజ్. ఆ చిత్రంలో అతనితో సమానంగా చేయడానికి చాలా కష్టపడ్డాను. అతనితో డ్యాన్స్ చేయాలంటే కత్తిమీద సామే. హృతిక్ డ్యాన్స్ చేసేటప్పుడు అతని శరీరం చాలా ఫ్లెక్సుబుల్ గా ఉంటుందని, ఆ క్రమంలో అతనికి సహజసిద్ధంగానే శక్తి వస్తుందని కత్రినా తెలిపింది. నాతో కలిసి  హృతిక్ రిహార్సల్ లో  డ్యాన్స్ చేయకపోయినా.. షూటింగ్ సమయంలో మాత్రం అతను డ్యాన్స్ చేసిన తీరు అబ్బురపరిచిందని కత్రీనా తెలిపింది. ఆ సినిమా టైటిల్ సాంగే తనకు ఇష్టమైన ట్రాక్ అని 31ఏళ్ల కత్రీనా స్పష్టం చేసింది.
 

నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత దర్శకుడు సిద్దార్ధ రాజ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం తన కెరీర్ కు చాలా ముఖ్యమైనదిగా  సిద్ధార్ధ తెలిపాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే  భారీ పెట్టుబడి పెట్టానని దర్శకుడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement