ఆ సినిమాకు చాలా కష్టపడ్డా | 'Bang Bang' a very difficult film for me: Katrina Kaif | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు చాలా కష్టపడ్డా

Published Tue, Sep 30 2014 7:00 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

ఆ సినిమాకు చాలా కష్టపడ్డా

ఆ సినిమాకు చాలా కష్టపడ్డా

న్యూఢిల్లీ: హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రంలో నటించడానికి చాలా కష్టపడ్డానని ఆ చిత్ర హీరోయిన్ కత్రినా కైఫ్ తెలిపింది. ప్రపంచంలోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో పని చేయడం కోసం మిగతా చిత్రాల కంటే ఎక్కువ కష్టించాల్సి వచ్చిందని పేర్కొంది. సుమారు ఏడాదిపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఫైట్లు చాలా కొత్తగా ఉంటాయని తెలిపింది. ఇందులో తన నటన అభిమానులను తప్పక ఆకట్టుకుంటుందనే ధీమాను వ్యక్తం చేసింది.

 

ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం నిర్మాతలు సుమారు రూ.140 కోట్లు ఖర్చు పెట్టారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టుడియోస్ నిర్మించింది. ఈ సినిమా వచ్చే నెల రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement