
బెంగళూరు హోటళ్లకు షాక్
కబాలి సినిమా ఫీవర్ను క్యాష్ చేసుకోడానికి కర్ణాటక రాజధాని బెంగళూరులో కొన్ని స్టార్ హోటళ్లు చేసిన ప్రయత్నాలకు గండిపడింది. ఆ హోటళ్లలో కబాలి సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
హోటళ్లలో సినిమాల ప్రదర్శన సినిమాటోగ్రఫీ చట్టానికి వ్యతిరేకమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ తెలిపింది. దీంతో సినిమా ప్రదర్శనను రద్దు చేసిన హోటళ్ల యాజమాన్యాలు.. టికెట్ డబ్బులను తిరిగి ఇస్తున్నాయి. థియేటర్లో కాకపోయినా ఎక్కడో ఒకచోట కబాలి సినిమా మొదటిరోజు చూసేందుకు వీలు కుదిరింది కదాని సంతోషపడిన అభిమానులకు మాత్రం ఈ చర్యతో తీవ్ర నిరాశ మిగిలింది.