నలుగురు కుర్రాళ్ల ఆశయం | bhale kurrallu movie ready for release | Sakshi
Sakshi News home page

నలుగురు కుర్రాళ్ల ఆశయం

Published Tue, Sep 16 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

నలుగురు కుర్రాళ్ల ఆశయం

నలుగురు కుర్రాళ్ల ఆశయం

జీవితంలో బాగా స్థిరపడాలని ఆ నలుగురు కుర్రాళ్లు అనుకుంటారు. తమ ఆశయం నెరవేర్చుకోవడానికి హైదరాబాద్‌లో అడుగుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు అనుకున్నట్లుగానే స్థిరపడగలి గారా? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘భలే కుర్రాళ్లు’. శశాంక్, వికేష్, శ్రీచరణ్, బ్రహ్మ, భవ్య, నయన, సోనాలి, పవిత్ర ముఖ్య తారలుగా చరణ్ మల్లెల దర్శకత్వంలో ఉప్పలపాటి వికేష్ చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్.ఎమ్. ప్రేమ్, కెమెరా: శ్రీరామ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement