ఫిలిం స్కూల్ పెడుతున్న భారతీరాజా | Bharathiraja to set up film school | Sakshi
Sakshi News home page

ఫిలిం స్కూల్ పెడుతున్న భారతీరాజా

Published Mon, Jul 7 2014 12:11 PM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM

ఫిలిం స్కూల్ పెడుతున్న భారతీరాజా - Sakshi

ఫిలిం స్కూల్ పెడుతున్న భారతీరాజా

అనేకమంది యువ దర్శకులను తన చేతుల మీదుగా తీర్చిదిద్దిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇప్పుడు కొత్తగా ఫిల్మ్ స్కూల్ ఒకదాన్ని ప్రారంభిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈ ఫిలిం స్కూలుకు సంబంధించిన పనులు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయని ఓ ప్రకటనలో తెలిపారు. డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ స్కూలు తాను పెట్టడం లేదని భారతీరాజా అన్నారు.

దీనివల్ల రాబోయే కాలంలో సమాజానికి మంచి దర్శకులు, కళాకారులు అందాలన్నదే తన ఏకైక లక్ష్యమని ఆయన చెప్పారు. దర్శకుడిగా పలు జాతీయ అవార్డులు పొందిన భారతీరాజా.. కమల్ హాసన్, రజనీకాంత్, సత్యరాజ్ లాంటి చాలామందిని తమిళ తెరకు పరిచయం చేశారు. 16 ఏళ్ల వయసు, టిక్.. టిక్.. టిక్, అలైగల్ ఒయివతిల్లై లాంటి అనేక హిట్ చిత్రాలు ఆయన చేతుల మీదుగానే వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement