
ప్రముఖ భోజ్‌పురి దర్శకుడు షాద్ కుమార్ (49) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వర్గ్’ సినిమా ఈ నెల 24న రిలీజ కావాల్సి ఉండగా ఈ లోపు ఆయన మరణించటంతో చిత్రయూనిట్ షాక్‌కు గురయ్యారు. భోజ్‌పురిలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన షాద్ కుమార్ ‘ఏక్ లైలా, తీన్ చైలా’, ‘తుమ్ హారే ప్యార్‌కి కసమ్’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అసిస్టెంట్ ఫొటోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నిర్మాతగా దర్శకుడిగా ఎదిగిన షాద్, ఇటీవల సినిమాల్లో తీవ్రం నష్టపోయారు. ప్రస్తుతం తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేని పరిస్తితిలో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. షాద్ కుమార్ అసలు పేరు షమ్‌షాద్ అహ్మద్.
Comments
Please login to add a commentAdd a comment