
గత సీజన్‌లో ఇచ్చిన టాస్క్‌లనే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి ఇస్తుంటాడు బిగ్‌బాస్. రెండో సీజన్‌లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా టెలిఫోన్ బూత్‌ను పెట్టి.. ఒక్కొక్కర్నీ పిలుస్తుంటాడు. అయితే వారు నామినేషన్ ఉంచి తప్పించుకునేందుకు ఓ అవకాశాన్నిచే క్రమంలో ఓ హౌస్‌మేట్స్‌ను కొన్ని త్యాగాలు చేయవల్సిందిగా అడగాల్సి ఉంటుందని పేర్కొంటాడు.
ఇక ఈ టాస్క్‌లో భాగంగా ఎవరు ఎక్కువగా క్లోజ్ అవుతారో వారి మధ్యే ఈ నామినేషన్ ప్రక్రియ ప్రధానంగా సాగుతుంది. అంటే గత సీజన్‌లో భాను-అమిత్, తనీష్-దీప్తి, సామ్రాట్-తేజస్వీలకు జరిగినట్టు. భాను కోసం అమిత్ తన క్యాప్ తీసేసి.. బట్టతలను అందరికీ చూపించాడు. తనీష్ కోసం దీప్తి సునయన జుట్టును కత్తిరించుకుంది. తేజస్వీ కోసం సామ్రాట్ క్లీన్ షేవ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సారి అలాంటి పరీక్షే పెట్టినట్టు కనిపిస్తోంది. బాబా భాస్కర్ ఎవరి కోసమో క్లీన్ షేవ్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక పునర్నవి సైతం రాహుల్ కోసం జుట్టును కత్తిరించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరెవరు ఎలాంటి త్యాగాలు చేశారో చూడాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.
Comments
Please login to add a commentAdd a comment