
ఆరోవారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం నాటి ఎపిసోడ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. గత మూడు వారాలుగా ఓపెన్ నామినేషన్ పెడుతున్న బిగ్‌బాస్.. ఆరో వారంలోనూ అదే పద్దతిని కొనసాగించాడు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో పునర్నవి వితికాను నామినేట్ చేయడం.. వరుణ్‌ను వితికా నామినేట్ చేసి.. పునర్నవిని సేవ్ చేయాలనుకోవడం లాంటి కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. అయితే వీటన్నంటి కంటె మహేష్ తన స్ట్రాటజీని బయట పెట్టడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత వరుణ్ సందేశ్, వితికాలతో ముచ్చటించిన మహేష్.. వాళ్లతో తన స్ట్రాటజీని పంచుకున్నాడు. ఈ నామినేషన్స్‌లో అలీని నామినేట్ చేద్దామని అనుకున్నానని, అయితే తాను కూడా నామినేషన్స్‌లో వచ్చేసరికి.. అలీ-రవి ఇద్దరిలో తక్కువ పర్ఫామెన్స్ ఇచ్చేది రవి కాబట్టి.. ఒకవేళ రవి నామినేషన్స్‌లో ఉంటే తాను సేవ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని అందుకని రవిని నామినేట్ చేశానని బయటకు చెప్పాడు.
ప్రస్తుతం ఇదే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రవికృష్ణ కంటే తనకు ఎక్కువ ఫేమ్ ఉందని మహేష్ భావిస్తున్నాడా? రవికృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తక్కువగా అంచనా వేస్తున్నాడా? బయటకు వచ్చిన రోహిణి కూడా రవినే సపోర్ట్ చేస్తుందని.. వీకెండ్‌లో తెలుస్తుంది ఎవరుంటారు? ఎవరు పోతారు?.. ఈ హౌస్‌లో ఒక్కక్షణం చాలు అంతా మారిపోవడానికి అంటూ రవికృష్ణ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తుండగా.. మహేష్ చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment