బిగ్‌ బాస్‌ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే | Bigg Boss 3 Telugu: Contestants Opens Up About Prize Money | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ : ప్రైజ్‌ మనీతో ఎవరెవరు ఏం చేస్తారంటే..

Published Sun, Oct 13 2019 11:43 AM | Last Updated on Wed, Oct 16 2019 5:08 PM

Bigg Boss 3 Telugu: Contestants Opens Up About Prize Money - Sakshi

తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్‌ 3 షోకు మరికొద్ది రోజుల్లో ఎండ్‌ కార్డ్‌ పడనుంది. దీంతో బిగ్‌బాస్‌ విజేత ఎవరనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ చర్చే 84వ ఎపిసోడ్‌గా మారింది. శనివారం స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన కింగ్‌ నాగార్జున.. ఇంటి సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇచ్చి ఎపిసోడ్‌ను అత్యంత వినోదకంగా మార్చారు. మొదట శుక్రవారం ఫన్నీగా జరిగిన ఇన్సిడెంట్స్‌ను చూపించారు.  ఫీల్ ది ఫిజ్ అనే టాస్క్‌లో బాబా భాస్కర్, అలీ, వ‌రుణ్‌లు పాల్గొన‌గా ఎండ్ బ‌జ‌ర్ మోగే స‌రికి ముగ్గురు 12 బాటిల్స్ ఫిజ్ తాగారు. దీంతో గేమ్ టైగా ముగిసింది. మ‌ళ్ళీ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫిజ్ బాటిల్స్ తీసుకొచ్చి తాగాలి అని చెప్పగా, అలీ రెజా ఒక‌టి తాగేసి రెండోది తాగుతున్న స‌మ‌యంలో ఎండ్ బ‌జ‌ర్ మోగింది. దీంతో టాస్క్ విజేత‌గా అలీ నిలిచారు. ఆ సమయంలో బాబా, వరుణ్‌, అలీ పడిన ఇబ్బందులు ఫన్నీగా అనిపించాయి.

(చదవండి : బిగ్‌బాస్‌ : ‘అతడు’ ఎలిమినేటెడ్‌!)

అనంతరం వితికా, వరుణ్‌లు స్విమ్మింగ్‌ పూల్‌లో కాసేపు రోమాంటిక్‌గా చర్చ జరిపారు. వరుణ్‌ను ఎత్తుకొని పూల్‌లో పడేసేందుకు వితికా గట్టి ప్రయత్నం చేసింది. కానీ అది ఆమెకు సాధ్యం కాలేదు. ఆ తర్వాత నాగార్జున ఇంట్లో ఉన్న 8 మంది సభ్యులకు ట్రెజర్‌ హంట్‌ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇంట్లో దాచిన 8 వస్తువులను 8 మంది పట్టుకోవాలని సూచించారు. దీంతో అందరూ వస్తులను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వారిలో అలీరెజానే ఎక్కువ వస్తువులను కనిపెట్టాడు. 8 వస్తువులలో 7 వస్తువులను ఇంటి సభ్యులు కనుక్కోని, ఒక వస్తువును మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో చేసేది ఏమిలేక ఆ వస్తువు ఎక్కడ ఉందో నాగార్జునే చెప్పాడు. ఆ వస్తువును బాబా భాస్కర్‌ తీసుకున్నాడు. 8 వస్తువులో ఒక్కో వస్తువుకు ఒక్కో అర్థం వచ్చేలా బిరుదు ఇచ్చారు నాగార్జున.  ఇందులో ఇతరులపై ఆధారపడేవాళ్లు, మోస్ట్‌ డేంజర్‌, భజన చేసే వాళ్లు, జోకర్‌, ఆట ఆడించేవారు, సుత్తి వేసేవాళ్లు, బలహీనమైన వాళ్లు అనే బిరుదు ఉన్నాయి. వాటిలో ఏది ఎవరి సూట్‌ అవుతుందో చెప్పాలని నాగార్జున చెప్పారు. అయితే ఇతరులపై ఆధారపడే వాళ్లు, బలహీనమైన వాళ్లుగా మహేష్‌ను ఎంచుకోగా, సుత్తి ఎక్కువగా మాట్లాడేది శివజ్యోతిగా ఎంచుకున్నారు. మోస్ట్‌ డేంజర్‌గా వితికాను బాబా భాస్కర్‌ ఎంచుకున్నాడు. ఫన్నీగా సాగిన ఈ ప్రక్రియలో ఎక్కువ బిరుదులు వితికా, బాబాలకు రావడం గమనార్హం.

అనంతరం మరో ఇంట్రెస్టింగ్‌ టాస్క్‌ ఇచ్చారు నాగార్జున. బిగ్‌బాస్‌ ప్రైజ్‌ మనీ రూ.50 లక్షలు వస్తే ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలన్నాడు. శ్రీముఖి ఆ సొమ్మును అమ్మనాన్నలకు ఇస్తానని చెప్పగా, వరుణ్‌ వితిక ఇస్తానని, రాహుల్‌ ఇల్లు కొంటానని, అలీ వాళ్ల నాన్నకు వ్యాపారం పెట్టించి, హోటల్‌ను తెరిపిస్తానని, మహేష్‌ హైదరాబాద్‌లో ఓ ఇళ్లు కట్టి దానికి వాళ్ల నాన్న పేరు పెడుతానని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరూ ఆ ప్రైజ్‌ మనీతో ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. అనంతరం ఇంటి సభ్యుల్లో ఎవరికి రూ.50 లక్షలు తీసుకునే అర్హత లేదో చెప్పాలని కింగ్‌ నాగార్జున అడగ్గా.. వితిక, వరుణ్‌లు బాబా భాస్కర్‌ పేరును, రాహుల్‌ వరణ్‌ పేరు, అలీ, జ్యోతి, శ్రీముఖి మహేష్‌ పేరును సూచించారు. మహేష్‌ విట్టా.. శ్రీముఖకి పేరును చెప్పి ఎందుకు అర్హత లేదో కూడా వివరించారు. ఆమె ప్రతిదీ గేమ్‌లాగే ఆడుతుందని, ఆమె ప్రవర్తను తనకు నచ్చడం లేదన్నాడు. రూ. 50 లక్షలు తీసుకునే అర్హత శ్రీముఖికి లేదన్నాడు. మహేష్‌ కామెంట్స్‌పై శ్రీముఖి మండిపడింది. అతను ప్రతి విషయంలో తనను టార్గెట్‌ చేస్తున్నాడని, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడని విమర్శించింది. ప్రతి స్టోరీని తనకు అనుకూలంగా, చాలా అందంగా నరేట్‌ చేస్తాడని చెప్పుకొచ్చింది. ఇలా ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే వీరి మధ్య నాగార్జున కలుగజేసుకొని ఆ వార్‌కి అక్కడే పుల్‌స్టాప్‌ పెట్టాడు.  మొత్తానికి శనివారం ఎపిసోడ్ కొంచెం కామెడీగా, కొంచె హాట్‌గా సాగింది. ఇక ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారో నేడు తెలియనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement