హిమజ అలా చేస్తుందని ఊహించా : పునర్నవి | Bigg Boss 3 Telugu Punarnavi Bhupalam Comments On Housemates | Sakshi

బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరో చెప్పిన పునర్నవి

Oct 10 2019 5:35 PM | Updated on Oct 15 2019 5:23 PM

Bigg Boss 3 Telugu Punarnavi Bhupalam Comments On Housemates - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పునర్నవి గత వారం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే! అయితే బయటకు వచ్చీరాగానే తన టీమ్‌ పీవీవీఆర్‌ (పునర్నవి, వరుణ్‌, వితిక, రాహుల్‌) ఫ్యాన్స్‌ అందరూ వరుణ్‌, రాహుల్‌కు ఓట్లు వేయాలని ప్రచారం చేపట్టింది. రాహుల్‌తో తనకున్న రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడుతూ తాము క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే అంటూ నొక్కి చెప్పింది. ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా మేం మంచి మిత్రులమే అని స్పష్టం చేసింది. రాహుల్‌ టాప్‌ 5లో ఉండాలి అని తన కోరికను బయటపెట్టింది. అందరూ అనుకుంటున్నట్టుగా బిగ్‌బాస్‌ స్క్రిప్టెడ్‌ కాదని వెల్లడించింది. ఇక్కడివి అక్కడ.. అక్కడివి ఇక్కడ చెప్తూ.. మనుషులు ఇలా కూడా ఉంటారా? అనేలా ప్రవర్తిస్తున్నాడంటూ పరోక్షంగా మహేశ్‌కు పంచ్‌ విసిరింది.

కాగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరు మానసికంగా ధృడంగా ఉండి వంద రోజులు నెట్టుకొస్తారో వారే విజేత అని ప్రకటించింది. పీవీవీఆర్‌ బ్యాచ్‌ గురించి పునర్నవి మాట్లాడుతూ ‘రాహుల్‌ వాళ్ల మమ్మీపై బెంగ పెట్టుకున్నాడు. రాహుల్‌ను రియల్‌ గేమర్‌ అని బాగా ఆటపట్టించేదాన్ని. ఓవర్‌ థింక్‌ చేస్తాడు.. పాపం వాడు మళ్లీ నామినేషన్‌లో ఉన్నాడు. వితిక.. బంగారం, చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది. కానీ టాస్క్‌లో మాత్రం గట్టి పోటీనిస్తుంది. వరుణ్‌ నాకు మరో బ్రదర్‌. వాళ్లందరినీ చాలా మిస్‌ అవుతున్నా’ అని తెగ బాధపడిపోయింది. ఇక బిగ్‌బాస్‌ను వీడి నాలుగు రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఎవరో తనను గమనిస్తున్నారన్న ఆలోచన ఇంకా పోవట్లేదంది. ఎలిమినేట్‌ అయిన సభ్యులను తప్పకుండా కలుస్తానంది.

పునర్నవి ఎలిమినేట్‌ అయినపుడు హిమజ టీవీ ముందు డాన్స్‌ చేసిన విషయంపై స్పందిస్తూ.. ‘అది ఊహించిన విషయమే’ అని కొట్టిపారేసింది. హిమజ ఎందుకు అలా చేసిందో తననే అడుగుతానంది. దానితో వాదనలో ఎవరూ గెలవలేరని చెప్పుకొచ్చింది. ఇంటిసభ్యుల గురించి చెప్తూ.. ‘అలీ రెజా.. స్వీట్‌ పర్సన్‌ & స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌. రవి.. ఊరికే ఇన్‌ఫ్లూయెన్స్‌ అయిపోతాడు. అతన్ని నేనెప్పుడూ చెడ్డగా అనుకోలేదు. పర్సనల్‌గా అతనికి నాకు ఎలాంటి గొడవ లేద’ని స్పష్టం చేసింది. ఇక శ్రీముఖి ఎనర్జిటిక్‌.. తమన్నా సింహాద్రి చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తుందని తెలిపింది. ప్రొఫైల్‌ పిక్చర్‌ మార్చమన్న ఓ నెటిజన్‌ అభ్యర్థనకు పున్ను సున్నితంగా నో చెప్పింది. ఇక ఈ వారం నాకిష్టమైన రెండు కోతులు నామినేషన్‌లో ఉన్నాయంది. రాహుల్‌, వరుణ్‌లు ఇద్దరికీ ఓట్లు వేస్తూ సేవ్‌ చేయండంటూ ప్రేక్షకులను వేడుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement