పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం | Bigg Boss 3 Telugu Punarnavi Fires On Srimukhi In Task | Sakshi
Sakshi News home page

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

Published Tue, Sep 3 2019 4:56 PM | Last Updated on Tue, Sep 3 2019 5:05 PM

Bigg Boss 3 Telugu Punarnavi Fires On Srimukhi In Task - Sakshi

ఏడో వారానికిగానూ నామినేషన్‌ప్రక్రియ పూర్తైంది. ఈ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రవి, అలీ, మహేష్‌, రాహుల్‌, శ్రీముఖి నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇంట్లో దొంగలుపడ్డట్లు తెలుస్తోంది. దొంగలు దోచిన నగరం అనే ఈ టాస్క్‌లో ఇళ్లంతా యుద్దవాతావరణాన్ని తలపిస్తోంది. ఒకర్నొకరు మాటలతో దూషించుకుంటూ ఉన్నారు.

తాజాగా రిలీజ్‌ చేసిన ఈ ప్రోమోను బట్టి ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రోమోలో పునర్నవి-శ్రీముఖి వాగ్వాదం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.  ఇక వితికా కూడా రెచ్చిపోయినట్లు అర్థమవుతోంది. వరుణ్‌-వితికాలకు కూడా ఏదో గొడవ జరగనున్నట్లు చూపించారు. మరి నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఈ టాస్క్‌లో ఎవరు గెలుపొందారు? వాంటెడ్‌ అని చూపించిన వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ శిల్పా చక్రవర్తి.. టాస్క్‌లో పోషించే పాత్ర ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement