బిగ్‌బాస్ హౌస్‌లో రెండు జంటలు ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. వరుణ్-వితికా ఓ జంట అయితే.. రాహుల్-పునర్నవి మరో జంట అని ఫన్నీ కామెంట్లు వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ, వీరిద్దరి వ్యవహారంపై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
మొన్నటి ఎపిసోడ్‌లో రాహుల్ జైల్లో బంధీగా ఉన్నప్పుడు.. పునర్నవి జైలు వద్దకు వచ్చి రాత్రంతా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంది. ఇక అక్కడ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉదయాన్నే రాహుల్‌ను నిద్రలేపే ప్రయత్నం చేసింది పునర్నవి. ఈ పిచ్చిది ఇలానే వాగుతది అని సరదాగానే అన్నా.. పునర్నవి మాత్రం అలిగి వెళ్లిపోయి కన్నీరు పెట్టుకుంది.
ఇదే విషయమై పునర్నవి రాహుల్‌పై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వాటికి రాహుల్ కూడా ఫన్నీగా జవాబులిచ్చాడు. ఇలాంటివే ఎందుకు టెలికాస్ట్ అవుతాయి.. ఆమె అన్న మాటల్ని చూపించడం లేదు.. నేను అన్న మాటల్నే చూపిస్తున్నారంటూ వాపోయాడు. ఇక దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. మరి పునర్నవి ఫిర్యాదుకు నాగ్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment