
టాస్క్‌లో భాగంగా.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్ అంటూ రాహుల్, రవి పేర్లను అందరూ కలిసి ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించారు. దీంతో వారిద్దర్నీ జైల్లో బంధించాల్సిందిగా ఆదేశించాడు. జైల్లో ఉన్న రాహుల్ వద్దకు పునర్నవి వచ్చి ముచ్చట్లు పెట్టింది. దీంట్లో భాగంగా వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంది.
తనకు ఇంకా చదువుకోవాలని ఉందని, ఇది కాకపోతే తాను ఎలాగైనా బతకగలనని.. ఎందుకంటే తనకు డిగ్రీ ఉందని ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకగలనని రాహుల్‌తో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. తనకు ఆప్షన్స్ అంటే చాలా ఇష్టమని, అలా ఉంటే తనేప్పుడు ఎవరికీ తలొంచకుండా ఉండగలనని చెప్పుకొచ్చింది. అలానే ఉంటది ఇక్కడ.. తాను ఓ తెలుగు అమ్మాయిని అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించే పునర్నవి మాట్లాడినట్లు అనిపిస్తోంది.
దీనికి బదులుగా రాహుల్.. ‘ఇండస్ట్రీని వదిలేసి.. బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారని అన్నావ్‌గా.. పెళ్లి చేసుకో.. సెటిల్ అయిపో..’ అంటూ సలహా ఇచ్చాడు. తనకు ఇంకో రెండేళ్లు చదువుకోవాలని ఉందంటూ రాహుల్‌తో చెప్పుకొచ్చింది. ఇలా రాత్రంతా మాట్లాడుకుంటూ ఉన్న ఈ జంటకు.. ఉదయాన్నే ఓ గొడవ జరిగింది. పడుకుని ఉన్న రాహుల్‌ను లేపేందుకు ప్రయత్నించింది పునర్నవి. పిచ్చిది అలానే చేస్తది అని పునర్నవి గురించి రాహుల్.. రవితో అనేసరికి ఆమె ఫీల్ అయింది. అక్కడి నుంచి వెళ్లి కన్నీరుపెట్టుకుంది. ఇక మరి నేటి ఎపిసోడ్‌లో వీరిద్దరి మధ్య ఏం జరగనుందో? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment