
బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిదో వారం గడిచిపోయేందుకు వచ్చేసింది. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్‌లో అందరి లెక్కలు సరిచేసిన నాగ్.. విశ్వరూపం చూపించాడు. మొదటిసారిగా.. ఇంటి సభ్యులపై ఆ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. బిగ్‌బాస్‌నే ఎదిరించడం, టాస్క్‌లను నిందించడం లాంటి అంశాలపై బిగ్‌బాస్ నిర్వాహకబృందం కూడా సీరియస్ అయినట్లు కనిపిస్తోంది. అందుకు నాగ్ కూడా హౌస్‌మేట్స్ మీద విరుచుకపడాల్సి వచ్చింది.
అయితే నేటి ఎపిసోడ్‌లో సండ్ ఫండేగా మారనున్నట్లు కనిపిస్తోంది. హౌస్ అంతా సందడి నెలకొనన్నుట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్‌ను ఇరగదీస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీముఖికి ఇచ్చిన టాస్క్‌లో నాగార్జునను తన భాయ్‌ఫ్రెండ్‌గా మార్చేసుకుంది. ఇక రాహుల్-పునర్నవిల మధ్య నిన్న గొడవ జరగడం.. పునర్నవి కంటతడి పెట్టడం.. స్నేహం ఇక్కడితోనే కట్ అని చెప్పడం అందరికీ తెలిసిందే. అయితే నేటి ఎపిసోడ్ రాహుల్ చేత ఓ పాట పాడించి.. పున్నును కూల్ చేసేందుకు టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ పాడిన ఈ పాటతో పునర్నవి మామూలు స్థితికి వచ్చిందా? లేదా అన్నది చూడాలి. ఇక నేటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌కు గురైన వ్యక్తి శిల్పా చక్రవర్తి అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Ninna heat ni beat cheyataniki evala cool & fun funday ki get ready#BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa pic.twitter.com/VWwZgjGX9H
— STAR MAA (@StarMaa) September 15, 2019
Comments
Please login to add a commentAdd a comment