బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు! | Bigg Boss 3 Telugu Is Srimukhi Captain In Eight Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. శ్రీముఖి కెప్టెన్‌ కానుందా?

Published Thu, Sep 12 2019 4:52 PM | Last Updated on Thu, Sep 12 2019 5:11 PM

Bigg Boss 3 Telugu Is Srimukhi Captain In Eight Week - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇప్పటికీ ఏడువారాలు పూర్తయ్యాయి. ఎనిమిదో వారంలో అడుగుపెట్టిన హౌస్‌మేట్స్‌.. నామినేషన్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఎనిమిదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు శ్రీముఖి, శిల్పా, హిమజ, పునర్నవి, మహేష్‌ నామినేట్‌ అయ్యారు. ఇక ఈ వారం బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ బిగ్‌బాస్‌కే తలనొప్పిగా మారింది. బిగ్‌బాస్‌ ఆదేశాలనే లెక్కచేయకుండా కొందరు చిన్నచూపు చూస్తున్నారు. టాస్క్‌లో చెత్త పర్ఫామెన్స్‌ ఇచ్చిన శ్రీముఖి, మహేష్‌, పునర్నవిలకు షూస్‌ పాలిష్‌చేసే టాస్క్‌ను పనిష్మెంట్‌గా ఇచ్చాడు. మహేష్‌, పునర్నవిలు ఈ పనిష్మెంట్‌ను చేయడానికి ఒప్పుకోలేదు. అయితే శివజ్యోతి బుజ్జగించడంతో మహేష్‌ చివరకు తలొంచాడు. కానీ పునర్నవి మాత్రం ఎంతమాత్రం వెనక్కితగ్గలేదు. 

శ్రీముఖి మాత్రం ఆ పనిష్మెంట్‌ను అందరికంటే ముందే స్వీకరించింది. అయితే శ్రీముఖి ఈ సారి కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపికైనట్లు కనిపిస్తోంది. కెప్టెన్‌ కావాలని ఇదివరకే ఎన్నోసార్లు ప్రయత్నించిన శ్రీముఖికి భంగపాటే ఎదురైంది. ఈసారైనా కెప్టెన్‌గా ఎన్నికవుతుందా? లేదా అన్నది చూడాలి. బరువులెత్తగలవా జెండా పాతగలవా అనే ఈ టాస్క్‌ కొంచెం కఠినంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వితికా, శ్రీముఖి, శివజ్యోతిలను వరుణ్‌, రవి, మహేష్‌లు ఎత్తుకుని అటు ఉన్న జెండాలను ఇటు పెట్టాల్సి ఉంటుంది. అయితే వితికాను ఎత్తుకున్న వరుణ్‌, శివజ్యోతిని మోస్తున్న మహేష్‌లు కాస్త త్వరగానే గమ్య స్థానాలకు చేరుకుంటూ జెండాలను పెడుతున్నారు. అయితే శ్రీముఖిని ఎత్తుకున్న రవి మాత్రం కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ మేరకు నెటిజన్లు రవిపై జాలి చూపిస్తున్నారు. రవి మధ్యలోనే కూలిపోతాడేమో, టాస్క్‌ తరువాత రవి పరిస్థితి ఏంటో అని జాలిపడుతున్నారు. మరి వీరి కామెంట్లకు బదులిస్తూ.. శ్రీముఖి టాస్క్‌ గెలిచి.. కెప్టెన్‌గా ఎన్నికవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే శివజ్యోతి కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా గెలిచి రెండో సారి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టిస్తుందా? లేదా.. ఇంతవరకు కెప్టెన్సీ టాస్క్‌ల్లో పోటీపడటమే గానీ విజయం సాధించని వితికా, శ్రీముఖిలు కెప్టెన్‌గా ఎన్నికవుతారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement