బిగ్‌బాస్‌ : మరొకరికి టికెట్‌ టు ఫినాలే | Bigg Boss 3 Telugu : Srimukhi Got Ticket To Finale | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : టాప్‌ 5కి చేరిన ‘ఆమె’

Published Sat, Oct 26 2019 11:15 PM | Last Updated on Mon, Oct 28 2019 12:54 PM

Bigg Boss 3 Telugu : Srimukhi Got Ticket To Finale - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 తుది అంకానికి చేరుకుంది. గత పద్నాలుగు వారాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ మరోవారం రోజుల్లో ముగియనుంది. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఇక ఈ వారం అలీ రెజా, శివజ్యోతి, వరుణ్‌,శ్రీముఖి నామినేషన్‌లో ఉన్న  సంగతి తెలిసిందే. అయితే, శనివారం నాటి ఎపిసోడ్‌లో ఒకరు లేదా ఇద్దరు సేవ్‌ అయ్యే అవకాశముందని హోస్ట్‌ నాగార్జున చెప్పాడు. ఎవరెవరు సేవ్‌ అవుతారో తెలుసుకోవడానికి దీపావళీ సందర్భంగా.. వారి పేర్లు రాసి ఉన్న పార్టీ పూపర్స్‌ గన్‌ తలా ఒకటి ఇచ్చి పేల్చమన్నాడు.

ఎవరి గన్‌ నుంచి రంగురంగుల కాగితాలు బయటికొస్తాయో.. వారు సేవ్‌ అవుతారని తెలిపాడు. మిగిలినవారు నామినేషన్‌లోనే ఉంటారని చెప్పాడు. ముందుగా వరుణ్‌, తర్వాత అలీ గన్‌ పేల్చగా.. వాటిల్లో ఎలాంటి రంగులు రాలేదు. దాంతో వారిద్దరూ సేవ్‌ కాలేదని నాగార్జున తెలిపాడు. ఇక శివజ్యోతి, శ్రీముఖి వారి చేతుల్లో ఉన్న గన్‌లను పేల్చలేకపోయారు. రెండో ప్రయత్నంలో శ్రీముఖి గన్‌ పేల్చగా.. దాట్లోంచి రంగుల కాగితాలు వచ్చాయి. దాంతో శ్రీముఖి సేవ్‌ అయి టికెట్‌ టు ఫినాలేకు చేరుకున్నట్టు  నాగ్‌ ప్రకటించాడు. ఇక శివజ్యోతి గన్‌లో నుంచి ఎలాంటి రంగుల కాగితాలు రాకపోవంతో ఆమె కూడా సేవ్‌ కాలేదని నాగ్‌ వెల్లడించాడు. వరుణ్‌, శివజ్యోతి, అలీరెజా ముగ్గురూ నామినేషన్‌లో కొనసాగుతున్నారు.

ఇప్పటికే  రాహుల్‌, బాబా భాస్కర్‌ టికెట్‌ టు ఫినాలె గెలుచుకుని టాప్‌ 5కి చేరారు.  మిగిలిన ముగ్గురిలో ఫైనల్‌లో పోటీ పడే ఆ ఇద్దరు ఎవరు..? ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది. అయితే, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తక్కువగా ఉన్న శివజ్యోతి ఎలిమినేట్‌ అయినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్‌ 3 తెలుగు రియాలిటీ షోకు దీపావళీ (అక్టోబర్‌ 27) రోజున శుభం కార్డు పడనుందనే వార్తల్లో నిజం లేదని తెలిసింది.  అక్టోబర్‌ 28 నుంచి స్టార్‌ మా ఛానల్‌లో కొత్త సీరియల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారమే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 గ్రాండ్‌ ఫినాలే జరగనుందని సోషల్‌ మీడియాలో తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే, శనివారం ఎపిసోడ్‌ అలాంటి పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. మరో వారంపాటు బిగ్‌బాస్‌ తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement