బాలీవుడ్ చిత్రంలో జంటగా రానా, బిపాసా!
ముంబై: మరోసారి దగ్గుబాటి రానా, బిపాసాబసు జంటగా బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి 'నియా' అని పేరును ఖారారు చేశారు. 'నియా' అంటే ఉద్దేశం అని అర్ధం.
జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను కొత్తగా ఆవిష్కరించనున్నట్టు దర్శకుడు వెల్లడించారు. సున్నితమైన ప్రేమకథలోని పాత్రలకు రానా, బిపాసాలు సరిపోతారనే ఉద్దేశంతోనే తాను వారిని ఎంపిక చేశామన్నారు. గతంలో రానా, బిపాసాలు 'దమ్ మారో దమ్' చిత్రంలో నటించారు.