అభిమానులకు షారూఖ్ రిటర్న్ గిఫ్ట్ | bollywood Star sharukh khan giftes dilwale trailer to his fans | Sakshi
Sakshi News home page

అభిమానులకు షారూఖ్ రిటర్న్ గిఫ్ట్

Published Tue, Nov 10 2015 12:33 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

అభిమానులకు షారూఖ్ రిటర్న్ గిఫ్ట్

అభిమానులకు షారూఖ్ రిటర్న్ గిఫ్ట్

ఇటీవలే తన యాభయ్యో పుట్టిన రోజు జరుపుకున్న బాలీవుడ్ సూపర్స్టార్ షారూక్ ఖాన్, మరోసారి తన అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అమితాబ్ తరువాత అదే స్ధాయిలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే షారూఖ్, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ, తానే వ్యక్తిగతంగా ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ రోజంతా తన తన ఇంటికి వచ్చిన అభిమానులను, సన్నిహితులను కలుస్తూ ఎంతో ఆనందంగా గడిపాడు షారూక్.

అక్కడితో వదిలేయకుండా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ఓ ఆశ్చర్యకరమైన రిటర్న్ గిఫ్ట్ను పంపాడు బాద్ షా. షారూక్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్వాలే. షారూక్ సరసన కాజోల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ను అఫీషియల్ రిలీజ్ కంటే ముందు తనకు శుభాకాంక్షలు తెలిపిన ఫ్యాన్స్ ట్విట్టర్ అకౌంట్లకు నేరుగా పోస్ట్ చేశాడు కింగ్ఖాన్. షారూక్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్తో షాక్ అయిన అభిమానులు, ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

షారూక్, కాజోల్లతో పాటు వరుణ్ ధవన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. షారూక్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement