బన్ని అండ్ చెర్రి పాటలు | Bunny and Cherry audio Audio movie Audio Launched | Sakshi
Sakshi News home page

బన్ని అండ్ చెర్రి పాటలు

Published Mon, Nov 18 2013 12:38 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

బన్ని అండ్ చెర్రి పాటలు - Sakshi

బన్ని అండ్ చెర్రి పాటలు

ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభ ముఖ్యతారలుగా రూపొందుతోన్న చిత్రం ‘బన్ని అండ్ చెర్రి’. మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో హారున్ గని ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజేష్ పులి దర్శకుడు. శ్రీవసంత్ స్వరాలందిస్తున్న ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మారుతి ఆడియో సీడిని ఆవిష్కరించి, తొలి ప్రతిని జబ్బార్‌కి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. ప్రిన్స్, మహత్ చాలా ఎనర్జిటిగ్గా నటించారని, సినిమా సంతృప్తికరంగా వచ్చిందని దర్శకుడు చెప్పారు.
 
 కొత్తదనంతో కూడిన సైంటిఫిక్ కామెడీ థ్రిల్లర్ ఇదని నిర్మాణ నిర్వాహకుడు ఎస్.సుధీర్‌రావు తెలిపారు. చిన్న సినిమాగా ప్రారంభించి, పెద్ద సినిమాగా పూర్తి చేశామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రంలో భాగం అవ్వడం పట్ల చిత్రం యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా తనీష్, భీమినేని శ్రీనివాసరావు, రమేష్ పుప్పాల, నవీన్‌చంద్ర, నందు, వివేక్ కూచిభొట్ల, జూ.ఎస్వీఆర్, మధుర శ్రీధర్, జగన్, అమ్మిరాజు, మధుశాలిని తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement