
రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కరీంనగర్ పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది.
వర్మ హిందూ దేవుళ్లపై అనుచితి వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఫిర్యాదు చేశారు. వర్మ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదు చేశారు. రాంగోపాల్‌వర్మపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ భజరంగ్‌దళ్ నాయకులు కూడా మెదక్ జిల్లాలో ఫిర్యాదు చేశారు. ఓ మతాన్ని కించపరుస్తూ ట్విట్ చేసిన రాంగోపాల్‌వర్మపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.