
మంచు విష్ణు, పరుచూరి గోపాలకృష్ణ
శ్రీకాంత్, సునైన్, నాగినీడు, కౌసల్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘చదరంగం’. రాజ్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ గురువారం నుంచి జీ5లో ప్రసారమవుతోం ది. విష్ణు మాట్లాడుతూ– ‘‘ఎన్టీఆర్‌గారి రాజకీయ ప్రస్థానంలో జరిగిన చిన్న సంఘటన తీసుకుని ఇప్పటి సందర్భానికి లింక్ చేస్తూ చేసిన చిత్రమిది. ఈ సినిమా చేస్తానన్నప్పుడు.. జాగ్రత్తగా తీయాలి, వాస్తవాలను చూపించు అన్నారు నాన్నగారు (మోహన్‌బాబు). రాజీ పడకుండా తీశాం. భవిష్యత్ మొత్తం డిజిటల్‌దే’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నా పాత్ర కూడా ఉంటుంది’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘ఈ కథ వినగానే విష్ణు ఒప్పుకున్నారు. మొదట శ్రీకాంత్ కొంచెం ఆలోచించినా, విష్ణు కన్వి¯Œ ్స చేయడంతో ఒప్పుకున్నారు. ఆయన బాగా నటించారు’’ అన్నారు రాజ్.
∙
Comments
Please login to add a commentAdd a comment