
చరణ్ కోసం అంకుల్స్ వెయిటింగ్
బ్రూస్ లీ సినిమా ఫెయిల్యూర్తో ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా మీదే పడింది. ముఖ్యంగా భవిష్యత్ మెగాస్టార్ అన్న పేరున్న చరణ్ మగధీర తరువాత ఇంత వరకు ఒక్క...
బ్రూస్ లీ సినిమా ఫెయిల్యూర్తో ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా మీదే పడింది. ముఖ్యంగా భవిష్యత్ మెగాస్టార్ అన్న పేరున్న చరణ్ మగధీర తరువాత ఇంతవరకు ఒక్క భారీ విజయాన్ని కూడా నమోదు చేయలేదు. దీంతో చరణ్కు భారీ బ్రేక్ ఇచ్చేందుకు ఆయన అంకుల్స్ రెడీ అవుతున్నారట.
బ్రూస్ లీ తరువాత చరణ్ తమిళ సినిమా తనీ ఒరువన్ రీమేక్లో నటిస్తాడంటూ భారీ ప్రచారమే జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించాల్సి ఉన్నా.. చివరి నిముషంలో అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ను టేకోవర్ చేశాడు. నిర్మాతగా ఎంతో అనుభవంతో పాటు సినిమాను మార్కెట్ చేయటంలో కూడా మంచి టాలెంట్ ఉన్న అరవింద్.. చరణ్కు ఓ భారీ కమర్షియల్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట.
అదే సమయంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా చరణ్తో సినిమా నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. ఇటీవలే చరణ్తో నిర్మించబోయే సినిమాకు కథ కోసం వెతుకుతున్నాం అంటూ ప్రకటించిన పవన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న చరణ్, తిరిగి వచ్చాక ఎవరి నిర్మాణంలో సినిమాను పట్టాలెక్కిస్తాడో చూడాలి.