ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకి గజగజ వణికిపోతోంది. అయితే తాజాగా.. దేశ రాజధానితో పాటు తెలంగాణలో కరోనా కేసులు నమోదు కావడంపై ఛార్మి.. తన ట్విటర్ అకౌంట్‌లో కరోనా వైరస్‌కు స్వాగతం అంటూ వ్యాఖ్యలు చేయడం పై పెద్ద దుమారమే రేగుతోంది. జనం ఒక వైపు చస్తుంటే కనీస మానవత్వం లేకుండా కరోనాకు వెల్కమ్ చెబుతావా అంటూ ఆమెపై తిట్ల వర్షానికి లంకించుకున్నారు. ఆపదలో ఉన్నవారికి చేతనైతే సాయం చేయాలని, ఇలా చేయకూడదని హితవు పలికారు. చదవండి: ఢిల్లీ, తెలంగాణలలో కరోనా కేసులు నమోదు
దీంతో ఛార్మి వెంటనే ఆ వీడియో డిలీట్ చేసింది. అయితే అప్పటికే నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడంతో సమాధానంగా మరో ట్వీట్ చేసింది. 'నేను ఇలాంటి సందర్భంలో అలాంటి వీడియో పోస్ట్ చేయడం తప్పు. మీరు చేసిన కామెంట్స్ అన్నీ చదివాను. ఇది చాలా సున్నితమైన అంశం అని నేను భావించలేకపోయాను. ఈ చర్య పట్ల నేను క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావు' అంటూ ట్వీట్ చేసింది. చదవండి: పుకార్లపై స్పందించిన సునీతా కృష్ణన్
I have read all ur comments n I apologise for the video posted .. it was an act of immaturity for a very sensitive topic , n hence shall be carefull in my further reactions as it was of least knowledge to me the rounds it created .. pic.twitter.com/mXT95O1tFL
— Charmme Kaur (@Charmmeofficial) March 2, 2020
Comments
Please login to add a commentAdd a comment