సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరమితమైన సెలబ్రిటీలు కుటుంబ సభ్యుల మధ్య ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా హీరో రామ్‌చరణ్ తన నాన్నమ్మ అంజనాదేవి నుంచి వెన్న తీయడం నేర్చుకుని మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఆ వీడియోను మెగాస్టార్ చిరంజీవి రీ ట్వీట్ చేస్తూ కామెంట్ చేశారు. (కిచెన్‌లో రామ్‌చరణ్.. ఏం చేస్తున్నాడో చూడండి)
‘మైడియర్ బచ్చా... మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్’ ఉడకదురా, ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. బట్టర్ ఎంత మంచిగా చేసినా, నీ స్థానం మాత్రం బెట్టర్ అవ్వదు’ అంటూ చిరంజీవి తనదైన రైమింగ్‌తో ట్వీట్ చేశారు. బచ్చా, బట్టర్, బెట్టర్ అంటూ ప్రాసతో కుమారుడి మీద ఉన్న ఆప్యాయతను, అమ్మ మీద ఉన్న ప్రేమను చూపించడంతో.. మీ టైమింగ్ 'రచ్చహ రచ్చస్య రచ్చోభ్యహ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫస్ట్ ప్లేస్ స్థానంలో అదే గ్యారంటీ నాకు మీ అమ్మ సురేఖ దగ్గర లేదనుకో అంటూ చిరు ఛమత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment