సెన్సార్‌ పూర్తి చేసుకున్న సైరా | Chiranjeevi Sye Raa Gets UA By Censor Board | Sakshi
Sakshi News home page

సెన్సార్‌ పూర్తి చేసుకున్న సైరా

Published Mon, Sep 23 2019 6:14 PM | Last Updated on Mon, Sep 23 2019 6:14 PM

Chiranjeevi Sye Raa Gets UA By Censor Board - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం సైరా. తొలి స్వతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

పవన్‌ కళ్యాణ్‌, రాజమౌళి, వివి వినాయక్‌, కొరటాల శివ లాంటి ఎంతో మంది ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సక్సెస్‌ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్‌కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. బిగ్‌ బీ అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement