'భోగి' రోజునే చిరు వస్తున్నాడు | chiru movie will release on bhogi: vinayak | Sakshi
Sakshi News home page

'భోగి' రోజునే చిరు వస్తున్నాడు

Published Wed, Sep 7 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

'భోగి' రోజునే చిరు వస్తున్నాడు

'భోగి' రోజునే చిరు వస్తున్నాడు

తూర్పుగోదావరి: అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతూ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'కి సంబంధించి తాజా అప్ డేట్స్ వచ్చాయి. చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ సినిమా విడుదల రోజును ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా భోగి రోజున సినిమాను విడుదల చేస్తామని వినాయక్ చెప్పారు. ఈ సినిమాతో మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.

అటు చిరు అభిమానులతోపాటు మొత్తం ప్రేక్షకులంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బుధవారం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో విద్యాగణపతిని సందర్శించిన వీ వినాయక్ అనంతరం మీడియాతో మాట్లాడారు. భోగి రోజున విడుదలయ్యే ఈ చిత్రం ఒక్క అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement