ఏడాదిలో 160 స్క్రీన్లతో వస్తారట! | Cinepolis to invest Rs 400 cr, add 160 screens across India | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 160 స్క్రీన్లతో వస్తారట!

Published Tue, May 24 2016 3:59 PM | Last Updated on Sat, Aug 11 2018 8:30 PM

ఏడాదిలో 160 స్క్రీన్లతో వస్తారట! - Sakshi

ఏడాదిలో 160 స్క్రీన్లతో వస్తారట!

న్యూఢిల్లీ: మెక్సికోకు చెందిన మల్టీప్లెక్స్ల నిర్మాణ సంస్థ సినీ పొలిస్ భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జావియెర్ సోటోమేయర్ చెప్పారు. ఇందులో భాగంగా దేశంలోని మొత్తం 60నగరాల్లో దాదాపు 160 సినిమా స్క్రీన్లు డిసెంబర్ 2017నాటికి పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

మొట్టమొదటిసారి అమృత్ సర్ లో 2009లో సినీ పొలిస్ పేరిట స్క్రీన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. 2015లో ఫన్ సినిమాస్ పేరుతో మరో అడుగు వేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల సిని పొలిస్.. ఫన్ సినిమాస్ పేరిట స్క్రీన్లు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో యూనిట్ గ్రూప్ అనే సంస్థ భాగస్వామ్యంతో కలిసి కొత్తగా నాలుగు స్క్రీన్లు ప్రారంభించిన సందర్భంగా ఆ సంస్థ ఈ వివరాలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement