దీపికా, రణ్‌వీర్‌ వివాహం.. జోక్సే జోక్స్‌! | Classy memes on Deepika and Ranveer wedding | Sakshi
Sakshi News home page

దీపికా, రణ్‌వీర్‌ వివాహం.. జోక్సే జోక్స్‌!

Published Fri, Nov 16 2018 4:53 PM | Last Updated on Fri, Nov 16 2018 5:34 PM

Classy memes on Deepika and Ranveer wedding - Sakshi

వివాహ బంధంతో బాలీవుడ్‌ హాట్‌ కపుల్‌ దీపికా పడుకొనే, రణ్‌వీర్‌ సింగ్‌లు ఒక్కటయ్యారు. ఇటలీలో అత్యంత ఆర్భాటంగా ఈ వివాహ వేడుక జరిగినా.. అక్కడి నుంచి ఒక్క ఫోటో బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. నవంబర్‌ 12 నుంచే పెళ్లి పనులు ప్రారంభమైనా దీపికా, రణ్‌వీర్‌లు తమ పెళ్లికి సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసే వరకు ఒక్క ఫోటో కూడా అభిమానులు చూడలేకపోయారు. పెళ్లి అప్‌డేట్స్‌ కోసం ఎదురు చూసి చూసి విసుగెత్తుకొచ్చిన కొందరు నెటిజన్లు తమ క్రియేటివిటీకి పనిపెట్టారు. దీపికా, రణ్‌వీర్‌ల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నామో అర్థం వచ్చేలా ఫన్నీ మేమ్స్‌ క్రియేట్‌ చేసి ట్రెండ్‌ చేస్తున్నారు.

దీపిక, రణ్‌వీర్‌ల పెళ్లి వేడుక నవంబర్‌ 14, 15 తేదీల్లో ఇటలీలో సింధ్‌, కొంకణ్‌ సంప్రదాయాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా వీరిమధ్య సాగిన అనుబంధం పెళ్లి పీటలకు చేరడంతో బాలీవుడ్‌ ప్రముఖులంతా కొత్త జంటను అభినందనల్లో ముంచెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement