‘ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను’ | Deepika Padukone Said I Am Excited To Looked Forward To My Marriage | Sakshi
Sakshi News home page

మా అమ్మనాన్నలే నాకు ఆదర్శం : దీపికా

Published Sat, Oct 27 2018 5:36 PM | Last Updated on Sat, Oct 27 2018 5:36 PM

Deepika Padukone Said I Am Excited To  Looked Forward To My Marriage - Sakshi

అందరు సాధరణ అమ్మాయిల్లానే నేను కూడా నా పెళ్లి రోజు గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని తెలిపారు బాలీవుడ్‌ పద్మావత్‌ దీపికా పదుకోన్‌. వచ్చే నెల 14, 15న దీపిక, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహబంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీపికా తాను తన వివాహ ఘడియల కోసి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సిని భాషలో చెప్పాలంటే ఓ కొత్త ప్రాజెక్ట్‌కు సైన్‌ చేసినప్పుడు ఎంత ఎగ్జైటింగ్‌గా ఉంటుందో ఈ క్షణం తాను అలానే ఫీలవుతున్నానని తెలిపారు.

వివాహ బంధాన్ని నిలుపుకునే విషయంలో తన తల్లిదండ్రులే తనకు ఆదర్శమని వెల్లడించారు. వారు తమ​ వ్యక్తిగత, వృత్తిపర జీవితాలను సమంగా బ్యాలెన్స్‌ చేసుకున్నారని.. తాను కూడా వారినే ఫాలో అవుతానని తెలిపారు. అయితే ఈ జంట కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేశారని సమాచారం. హాలీవుడ్‌ సెలబ్రిటీల ఫేవరెట్‌ ప్లేస్‌, అత్యంత ఖరీదైన హాలీడే స్పాట్‌ ఇటలీలోని లేక్ కోమో వీరి పెళ్లికి వేదిక కానుందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఉత్తర ఇటలీలోని లంబార్డీ ప్రాంతంలో మైమరిపించే ప్రకృతి సోయగాల నడుమ ఈ సరస్సు ఉండటంతో వివాహ వేదికగా ఈ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నట్టు తెలిసింది. గతంలో అనుష్క శర్మ - విరాట్‌ కోహ్లిల వివాహం, ఇషా అంబానీ నిశ్చితార్థపు వేడుక ఇక్కడే జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement