త్వరలో తెరపైకి తిరుమణం ఎనుం నిఖా | come soon thirumanam ennum nikkah | Sakshi
Sakshi News home page

త్వరలో తెరపైకి తిరుమణం ఎనుం నిఖా

Published Sat, Jun 28 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

త్వరలో తెరపైకి తిరుమణం ఎనుం నిఖా

త్వరలో తెరపైకి తిరుమణం ఎనుం నిఖా

తిరుమణం ఎనుం నిఖా చిత్రం త్వరలో తెరపైకి రానుంది. యువ నటుడు జయ్, నజ్రియా నజిమ్ జంటగా నటించిన చిత్రం తిరుమణం ఎనుం నిఖా. నవ దర్శకుడు అనీష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్ నిర్మించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత నెలలోనే విడుదల కావలసి ఉంది. కొన్ని సమస్యల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఎదురైన ఆటంకాలను తిరుమణం ఎనుం నిఖా అధిగమించిందని ఆ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించారు.

చిత్రం గురించి ఆయన తెలుపుతూ వివాహమనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రధాన ఘట్టమన్నారు. అలాంటి ఇతి వృత్తంతో నిర్మించిన తిరుమణం ఎనుం నిఖా ఎవరి మనోభావాలను కించపరచాలనో గాయపరచాలనో రూపొందించలేదన్నారు. ఒక్కో మతం ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను గొప్పగా ఆవిష్కరించిన చిత్రమిదన్నారు. ఏ విషయంలోనైనా చక్కని అవగాహన అవసరమని చెప్పే చిత్రం తిరుమణం ఎనుం నిఖా అని తెలిపారు.

భార్యాభర్తలు గాని, సహోదరులుగాని, స్నేహితులుగాని, బంధువులుగాని పరస్పర అవగాహనతో, అర్థవంతమైన జీవితాన్ని గడపాలన్నదే చిత్ర ప్రధాన అంశమని వివరించారు. చిత్రానికి నెలకొన్న సమస్యలు తొలగాయని ముస్లిం సోదరుల పండుగ రంజాన్ రోజున గాని తిరుమణం ఎనుం నిఖా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement