రజనీ, కమల్‌ ఎవరైనా రాజకీయాల్లొకి రావొచ్చు | comedian vivek says Rajini and Kamal can come to politics | Sakshi
Sakshi News home page

రజనీ, కమల్‌ ఎవరైనా రాజకీయాల్లొకి రావొచ్చు

Published Mon, Aug 14 2017 12:24 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

రజనీ, కమల్‌ ఎవరైనా రాజకీయాల్లొకి రావొచ్చు - Sakshi

రజనీ, కమల్‌ ఎవరైనా రాజకీయాల్లొకి రావొచ్చు

తమిళసినిమా: రజనీకాంత్, కమలహాసన్‌ ఇలా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వచ్చిన తరువాత నూరు శాతం అంకిత భావం కలిగి ఉండాలని హాస్యనటుడు వివేక్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం నామక్కల్‌ సమీపంలోని పొదుపట్టి గ్రామంలోని గ్రీన్‌పార్క్‌ పాఠశాలలో జరిగిన సాంస్కృత కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఈయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులో వర్షాభావం అధికంగా ఉందన్నారు. దీంతో పంటలు పండక రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారన్నారు. వర్షాభావాన్ని అధిగమించడం విద్యార్థులు,యువత చేతి లో ఉందని అన్నారు.

దివంగత పూర్వ రాష్ట్రపతి, విజ్ఞాని అబ్దుల్‌ కలామ్‌ విజ్ఞప్తి మేరకు తాను రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. ఇప్పటికే 28 లక్షల 90 వేల మొక్కలను నాటామని, కోటి మొక్కలను నాటాలన్నది మా లక్ష్యమని అన్నారు. విద్యార్థులు మొక్కలు నాటే కార్యానికి నడుం బిగించాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ముందుకు వచ్చి మీకు సహకరిస్తుందని చెప్పారు. రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగప్రవేశం గురించి మాట్లాడుతూ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వచ్చిన తరువాత వంద శాతం అంకిత భావంతో ప్రముఖ నేతలు కామరాజర్, కక్కన్, ఓమందూర్‌రామ్, పశుంపెన్‌ ముత్తురామలింగం, అబ్దుల్‌కలాం లాంటి ఉత్తమ నేతలా పేరు తెచ్చుకోవాలని వివేక్‌ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement