‘సింధూరపువ్వు’... ఓ థ్రిల్లర్!
‘సింధూరపువ్వు’... ఓ థ్రిల్లర్!
Published Tue, Nov 26 2013 12:01 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
రమేష్, మీరానందన్ జంటగా శ్రీ లక్ష్మీసింధు క్రియేషన్స్ పతాకంపై పుల్లేటి దుర్గామోహన్ నిర్మించనున్న చిత్రం ‘సింధూరపువ్వు’. మల్లా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ప్రేమ ప్రధానంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇందులో మెయిన్ విలన్‌గా రాజీవ్ కనకాల, మలేసియన్ పోలీసాఫీసర్ పాత్రను రవిబాబు చేయనున్నారు. సింగపూర్, మలేసియాల్లో సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. హాలీవుడ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం’’ అని చెప్పారు. ఎమ్మెస్, పృథ్వీ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: విశ్వ, సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, సమర్పణ: జన్యావుల శేషయ్య, సహ నిర్మాతలు: ఎస్. భాను, మజ్జి రమేష్.
Advertisement
Advertisement