లేడీస్ అండ్ జెంటిల్‌మెన్
లేడీస్ అండ్ జెంటిల్‌మెన్
Published Tue, Oct 22 2013 1:26 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరి చిత్రాల దర్శకుడు ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి నిర్మాతగా మారారు. సైబర్ క్రైమ్ కథాంశంతో ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ అనే చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు.
తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.బి. మంజునాథ్‌ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు శ్రీధర్. ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. పంపిణీదారుడు శాంతయ్య కెమెరా స్విచాన్ చేయగా, మధురా శ్రీధర్ క్లాప్ ఇచ్చారు.
మహత్ రాఘవేంద్ర, చైతన్యకృష్ణ, అడవి శేష్, కమల్‌కామరాజ్, జాస్మిన్, స్వాతి దీక్షిత్, తేజస్విని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కుంచె రఘు, సాహిత్యం: సిరాశ్రీ.
Advertisement
Advertisement