మూడు నిమిషాలు కనిపిస్తాను - నాని
మూడు నిమిషాలు కనిపిస్తాను - నాని
Published Mon, Dec 16 2013 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
‘‘ఈ ఏడాది నేను నటించిన ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఆ లోటుని ఈ సినిమా తీరుస్తుంది. ఎందుకంటే ఇందులో నేను మూడు నిమిషాలు కనిపిస్తాను’’ అని నాని చెప్పారు. వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్ హీరోలుగా సిరాజ్ కల్లా దర్వకత్వంలో, నాని సమర్పణలో, రాజ్ నిడిమోర్, కృష్ణ డీకే నిర్మించిన ‘డి ఫర్ దోపిడి’ ఈ నెల 25న విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్ అంతటా ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ ‘‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నలుగురు కుర్రాళ్లు బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇందులో వినోదాత్మకంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. రెండు గంటలు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే సినిమా ఇదని సందీప్‌కిషన్, వరుణ్‌సందేశ్ తెలిపారు. ఇది కొత్త పంథాలో ఉండే చిత్రమని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.
Advertisement
Advertisement