మరో దానవీరశూరకర్ణ | 'Dana Veera Sura Karna' being remade with NTR's great | Sakshi
Sakshi News home page

మరో దానవీరశూరకర్ణ

Published Sat, Jan 24 2015 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

మరో దానవీరశూరకర్ణ

మరో దానవీరశూరకర్ణ

మహానటుడు ఎన్టీఆర్ నటించిన ‘దానవీర శూరకర్ణ’ చిత్రం ఎవర్‌గ్రీన్ క్లాసిక్. ఇప్పుడా చిత్రంతోనే నందమూరి నాలుగో తరం నటవారసులు రంగప్రవేశం చేస్తున్నారు. శ్రీ సాయి జగపతి పిక్చర్స్- సంతోష్ ప్రొడ క్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జేవీఆర్ దర్శకుడు. ముహూర్తం దృశ్యానికి హీరో కల్యాణ్‌రామ్ కెమెరా స్విచాన్ చేయగా, హీరో ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాత జె. బాలరాజు మాట్లాడుతూ - ‘‘ 90 రోజుల సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి, మార్చి 28న ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కృష్ణుడి పాత్రను మాస్టర్ ఎన్టీఆర్ పోషిస్తుండగా, నకులుడు-సహదేవునిగా సౌమిత్రి ద్విపాత్రాభినయం చేస్తున్నారు’’అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎన్. సుధాకర్‌రెడ్డి, సంగీతం: కౌసల్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement