Master NTR
-
తాతకు తగ్గ మనవళ్లు!
మహానటుడు ఎన్టీఆర్ నటించిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. కర్ణునిగా, కృష్ణునిగా, దుర్యోధనునిగా ఎన్టీఆర్ నటన అద్భుతం. ఇప్పుడు ఇదే చారిత్రక కథాంశంతో, అదే టైటిల్‌తో ఓ బాలల చిత్రం రానుంది. నందమూరి జానకీరామ్ పెద్ద తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటించిన ‘దానవీరశూరకర్ణ’ ఈ నెల 15న విడుదల కానుంది. జేవీఆర్ దర్శకత్వంలో చలసాని వెంకటేశ్వరరావు, జె.బాలరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ-‘‘బాల నటీనటులందరికీ మూడు నెలలు పాటు శిక్షణ ఇచ్చాం. పాటలు, సెట్లు, గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ‘బాలరామాయణం’ తరహాలో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన నమ్మకం ఉంది. ఎన్టీఆర్, సౌమిత్ర ఇద్దరూ తాతకు తగ్గ మనవళ్లనిపించుకుంటారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కౌసల్య. -
మరో దానవీరశూరకర్ణ
మహానటుడు ఎన్టీఆర్ నటించిన ‘దానవీర శూరకర్ణ’ చిత్రం ఎవర్గ్రీన్ క్లాసిక్. ఇప్పుడా చిత్రంతోనే నందమూరి నాలుగో తరం నటవారసులు రంగప్రవేశం చేస్తున్నారు. శ్రీ సాయి జగపతి పిక్చర్స్- సంతోష్ ప్రొడ క్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జేవీఆర్ దర్శకుడు. ముహూర్తం దృశ్యానికి హీరో కల్యాణ్‌రామ్ కెమెరా స్విచాన్ చేయగా, హీరో ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాత జె. బాలరాజు మాట్లాడుతూ - ‘‘ 90 రోజుల సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి, మార్చి 28న ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కృష్ణుడి పాత్రను మాస్టర్ ఎన్టీఆర్ పోషిస్తుండగా, నకులుడు-సహదేవునిగా సౌమిత్రి ద్విపాత్రాభినయం చేస్తున్నారు’’అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎన్. సుధాకర్‌రెడ్డి, సంగీతం: కౌసల్య.