తాతకు తగ్గ మనవళ్లు! | 'Daana Veera Soora Karna' on Aug 15th | Sakshi
Sakshi News home page

తాతకు తగ్గ మనవళ్లు!

Published Fri, Aug 7 2015 11:43 PM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

తాతకు తగ్గ మనవళ్లు! - Sakshi

తాతకు తగ్గ మనవళ్లు!

మహానటుడు ఎన్టీఆర్ నటించిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. కర్ణునిగా, కృష్ణునిగా, దుర్యోధనునిగా ఎన్టీఆర్ నటన అద్భుతం. ఇప్పుడు ఇదే చారిత్రక కథాంశంతో, అదే టైటిల్‌తో ఓ  బాలల చిత్రం రానుంది. నందమూరి జానకీరామ్ పెద్ద తనయుడు మాస్టర్ ఎన్టీఆర్   శ్రీకృష్ణునిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటించిన ‘దానవీరశూరకర్ణ’ ఈ నెల 15న విడుదల కానుంది. జేవీఆర్ దర్శకత్వంలో చలసాని వెంకటేశ్వరరావు, జె.బాలరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ-‘‘బాల నటీనటులందరికీ మూడు నెలలు పాటు శిక్షణ ఇచ్చాం. పాటలు, సెట్లు, గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ‘బాలరామాయణం’ తరహాలో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన నమ్మకం ఉంది. ఎన్టీఆర్, సౌమిత్ర ఇద్దరూ తాతకు తగ్గ మనవళ్లనిపించుకుంటారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కౌసల్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement