సంక్రాంతికే అబ్బాయ్! | Jr NTR's Nannaku Prematho Movie in Sankranthi Race | Sakshi
Sakshi News home page

సంక్రాంతికే అబ్బాయ్!

Published Thu, Dec 10 2015 12:28 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

సంక్రాంతికే అబ్బాయ్! - Sakshi

సంక్రాంతికే అబ్బాయ్!

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ పండగ కూడా చాలా ఆసక్తికరంగా సాగేలా ఉంది. ఒకపక్క బాబాయ్ నందమూరి బాలకృష్ణ సినిమా ‘డిక్టేటర్’ సంక్రాంతికి విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క అబ్బాయ్ చిన్న ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానున్నట్లు తాజాగా ప్రకటన వెలువడింది. నిజానికి, అయిదేళ్ల క్రితం సంక్రాంతికి ‘అదుర్స్’ రూపంలో ఓ  బ్లాక్‌బస్టర్ అందుకున్నారు చిన్న ఎన్టీఆర్.
 
 అందుకే ‘నాన్నకు ప్రేమతో’ 2016 సంక్రాంతికి విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించడంతో అభిమానులు ఆనందపడుతున్నారు. నిజానికి, ఈ సినిమా విడుదల వాయిదా పడిందని కొన్ని రోజులుగా ఫిలిం నగర్‌లో వాడి వేడి చర్చ జరుగుతోంది. దీంతో అభిమానులు సంక్రాంతికి తమ అభిమాన హీరో సినిమా ఉండదని నిరాశపడ్డారు.
 
 ఈ చర్చకు ఫుల్‌స్టాప్ పెడుతూ, ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుందని చిత్ర నిర్మాత  బీవీయస్‌యన్ ప్రసాద్ బుధవారం ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ీహ రోగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ఈ చిత్రం రూపొందింది. రకుల్ ప్రీత్‌సింగ్ నాయిక. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఈ నెల చివరి వారంలో పాటలను విడుదల చేయనున్నాం. సుకుమార్ శైలిలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement