
విజయ్ దేవరకొండ
సామాజిక బాధ్యతను ఫీలైన ఓ పవర్‌ఫుల్ స్టూడెంట్‌గా తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే అంశాల ఆధారంగా ‘డియర్ కామ్రేడ్’ సినిమా తెరకెక్కిందట. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ‘‘విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జూలై 26న విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు వై. అనిల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.